మొండి 67 నమ్మకం
telugu stories kathalu novels మొండి 67 నమ్మకం "ఇప్పుడన్నా చెప్పు వీరు.... అసలు ఏమైంది.... నీ రియల్ టార్గెట్ ఏంటి? ఏమవుతోంది నాకు లింక్ కావాలి"
వీరు కాసేపు సైలెంట్ గా కూర్చున్నాడు....
" చెప్తాను సార్.. కానీ నాదొక కండిషన్"
" ఏంటో చెప్పు"
" నన్ను కొన్ని రోజులు ఈ జైల్లో నుండి బయటపడేయ్యాలి"
" అది జరగదు వీరు"
" లేకపోతే ఇండియా మొత్తం ఒక్క రోజులో దెబ్బతింటుంది"
" ఎందుకు.?"
" ఏమైనా బ్లాస్ట్ చేస్తారా.. "
" కాదు..."
" ఎవరినైనా పెద్ద వాళ్ళని చంపేస్తారా..?"
" కాదు "
" మరి ఏంటో చెప్పు వీరు.... ఇంకా ఇలా దాస్తూ కూర్చుంటే ఎలా.."
వీరు ఒక్క క్షణం ఆగి..
ఆ రోజు లహాజా అనే పాకిస్తాన్ టెర్రరిస్ట్ ని పట్టుకున్నప్పుడు జరిగిన సంఘటనలు గుర్తొచ్చాయి వీరు కి
************
లహాజా ని చాలా సేపు భయపెట్టాక....కూడా నోరు తెరవలేదు... పోలీస్ వాన్ ఒక దాంట్లో ఎక్కించుకుని, ఒక ముగ్గురు కానిస్టేబుళ్లు, ఒక యస్ ఐ తో పాటు మరో చోటికి బయలుదేరాడు వీరు..వాన్ లో కూడా మాట్లాడుతూ ఉన్నాడు... కాసేపటికి అసలు నిజాలు చెప్పడం మొదలుపెట్టాడు...
లహాజా : " నీలాంటోళ్లు ఉన్నంత కాలం ఇండియా లో బాంబ్ బ్లాస్ట్ లు చెయ్యడం కుదరదు... ఇంకా ఇన్నేళ్లు ఇలా ఇండియా తో తిప్పలు పడి యుద్ధం చెయ్యడం... అందుకే కొత్తగా ప్లాన్ వేసింది ISI"
వీరు ; " ఏ ప్లాన్"
లహాజా : " ఇండియా అంతా ఒకే సారి కల్లోలం... ఇదే గనుక సక్సెస్ అయ్యి ఉంటే.. ఈ పాటికి ఇండియా లో దాదాపు 5 నుండి 7 శాతం మంది యువత దారి తప్పి పిచ్చోళ్ళగా మారిపోయేవాళ్ళు... దాదాపు 150 ఊర్లలో ఫ్లాక్కా పండించే వాళ్ళం..ఆర్మీ లో, సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో , సినిమా ఫీల్డ్ లో , కాలేజీల్లో ఎక్కడ పడితే అక్కడ యువకులు, మొత్తం దీని దారిన పడి దెబ్బ తినేవాళ్ళు. అప్పుడు సమయం చూసి యుద్ధం చేసి మేము ఇండియాలో