మొండి 72 ఒకప్పుడు
telugu stories kathalu novels మొండి 72 ఒకప్పుడు ఒకప్పుడు ఆఫీసులో వీరు ని పక్కన పెట్టి రాజేష్ కి ప్రొఫెసర్ దేబెంద్ర ఇంపార్థన్స్ ఇవ్వడం ఎవ్వరికీ నచ్చడం లేదు.. రాజేష్ కి వీరు తన కన్నా ముందే పెరిగిపోతున్నాడని చిన్న కుళ్లు ఉంది.. అందువల్లే తనకు తలకు మించిన భారం అయినా దేబెంద్ర ఇచ్చిన టాస్క్స్ చెయ్యడానికి సిద్ధపడ్డాడు..
అందులో భాగంగానే, బాంబ్ బ్లాస్ట్స్ తాలూకు కోడ్ ని తానే డీకోడ్ చేసాడు.. కానీ, ఆఫీసులో ఒకప్పుడు వీరు కి హెల్ప్ చేసినట్టుగా ఇప్పుడు అంత ఫ్రీ గా చెయ్యలేకపోతున్నాడు.. అప్పుడే లహాజా ని తెచ్చి నప్పుడు అతని దగ్గర పెన్ డ్రైవ్ దొరికిన విషయాన్ని దాచేశాడు... నిజానికి అతను తీసుకొచ్చిన కోడ్...బిగ్ పీపుల్ స్మాల్ పీపుల్ కూడా ఆ పెన్ డ్రైవ్ లో దొరికిందే...
వీరు కి అప్పట్లో ఆ కోడ్ ఇచ్చి డీ క్రిప్టు చేయగానే ఇవ్వగానే బాంబ్ సెర్చ్ ఆపరేషన్ లో కి వెళ్ళిపోయాడు..
ప్రొఫెసర్ దేబెంద్ర దగ్గరకు వెళ్ళాడు అప్పుడు
" సార్"
" ఆ ఏంటి.. ఎనీ డాటా.. అబౌట్ ఎక్స్ ప్లోజివ్స్"
" కనుక్కుంటున్నా సార్... "
" తొందరగా రాజేష్.. ఆపరేషన్ కి నువ్వు కూడా వెళ్ళాలి.. ఇదే వీరు అయితే నిమిషాల్లో