మొండి 74 టార్గెట్
telugu stories kathalu novels మొండి 74 టార్గెట్ మరొక పక్కన రాజేష్ వెళ్లి సెక్యూరిటీ గార్డుని పట్టుకునే పనిలో పడ్డాడు... తనకోసం సాయంగా మొత్తం NIA టీంని సిద్ధంగా ఉంచాడు... బయట బండిలో 5 రాజేష్ అనుచరులు తిరుగుతూ ఉన్నారు... ఏ క్షణంలో అయినా అతని ఆర్డర్స్ కోసం రెడి గా వేచి చూస్తున్నారు...
కార్గో ట్రాన్సపోర్టింగ్ కంపెనీ నుండి వచ్చానని... అర్జెంట్ గా బాస్ ని కలవాలని సెక్యూరిటీ గార్డు దగ్గర నిలబడ్డాడు... లోపల ఆఫీసర్ నుండి కాల్ గాని, లెటర్ గా ఉంటే తప్ప లోపలికి పంపాను అని భీష్మించున్నాడు సెక్యూరిటీ వాడు... చాలా సేపు అలా వాదించాక.. లోపలికి పంపించాడు రాజేష్ ని...
నెమ్మదిగా లోపలికి వెళ్లిన రాజేష్ చాలా సేపు వాకబు చేశాక తెలిసిన విషయం ఏంటంటే ఆ సెక్యురిటి గార్డు చావు బతుకుల్లో ఉన్నాడని.... కింగ్ ఏడ్వార్డ్ మెమోరియల్ హాస్పిటల్ లో ఉన్నాడని తెలిసింది... ఒక్క క్షణం ఇదంతా అబద్ధం ఏమో అణా డౌబ్ట్ వచ్చి.. టీం తో ఫోన్ చేయించి క్రాస్ చెక్ చేసుకున్నాడు... అక్కడ నిజంగానే ఆ పేషెంట్ అడ్మిట్ అయ్యి ఉన్నాడు...
హుటాహుటిన 12 కిలోమీటర్ల ప్రయాణం చేసి, హాస్పిటల్ దగ్గర అతని వార్డుకి చేరుకున్నాడు... అతని బంధువుని అని చెప్పి హాస్పిటల్ లోకి ఎంటర్ అయ్యాడు రాజేష్...
బుర్న్స్ వార్డ్ లో ఉన్నాడని తెలుసుకుని అక్కడికెళ్లి చూసాడు ఆ సెక్యురిటి గార్డు
వెళ్లి చూస్తే ఒళ్ళంతా కాలిపోయి ఉన్నాడు పాటిల్..
కేవలం 26 ఏళ్ల వయసులో అంతగా చర్మం మొత్తం కాలిపోయి ఒక మనిషిని ఉండటం చూసి బాధేసింది... రాజేష్ కి...
వీరు కి కాల్ చేసాడు రాజేష్... ఫోన్ మొగుతోంది కానీ వీరు ఎత్తడం లేదు...
********
దివ్య దొరికిపోయాననే బాధలో ఉన్న సమయంలో మాట్లాడాడు