మొండి 77 ప్రమాదం
telugu stories kathalu novels మొండి 77 ప్రమాదం బయటకొచ్చిన వీరు మనసులో అతని మనుషులు అందరూ కళ్ళ ముందు తిరుగుతున్నారు... రవి సార్... లేని అమ్మా, నాన్న, చైతన్య, ఫ్రెండ్స్, రాజేష్.. తన చేతుల్లో చనిపోయిన రాక్షసుల ముఖాలు... అన్నీ గుర్తొచ్చాయి.. దివ్య చివరగా ఇచ్చిన ముద్దు గుర్తొచ్చింది...
ఎలాగైనా దివ్య కోసం వెనక్కి రావాలని ఉంది వీరు కి... కానీ ఇక్కడ ఎదురుపడేది అంతర్జాతీయ ముఠా... రాక్షసుల మంద... వీరు లాంటి బలవంతులు, తెలివైన వాళ్ళు... ఒకటికి వంద మంది ఉంటారు... ఎలా వీళ్ళ నుండి అసలు బయట పడటం....
వీరు ఆ ఏరియా దాటి బయలుదేరగానే కాల్స్ వినడం మొదలుపెట్టింది దివ్య... వీరుతో చెవిలో రేసీవర్ మాట్లాడుతోంది....
ఒకపక్కన వీరు చెప్పిన ఒక్కో సైట్ ఓపెన్ చేసి అందులో జరిగే ట్రాంసాక్షన్స్ ని ..... ఫైల్స్ ని సైలెంట్ గా డౌన్లోడ్ చేస్తోంది... ఇవన్నీ వీరు జైల్ కెళ్లక పోయి ఉంటే ఎప్పుడో ట్రేస్ చేసేవాడు... ఆఫ్ కోర్స్ దివ్య కున్నంత స్పీడ్ హ్యాకింగ్ లో వీరూ కి లేదు .... నెమ్మదిగా సైట్ మొత్తం ఒకటి తరువాత ఒకటి చూస్తూ వెళ్తోంది...
వీరు ఇందాక దివ్య ఇరుక్కున్న ప్లేస్ కి చేరుకున్నాడు....ఎదురుగా కొంత మంది కాపలా గ్యాంగ్ తిరుగుతున్నారు... మైండ్ లో సెకండ్ కి వంద ఐడియాలు తిరుగుతున్నాయి... ఎదురుగా రౌడీ షీటర్స్ నలుగురు వీధి చివర్లలో అందరినీ కనిపెడుతూ ఉన్నారు...
వాళ్లలో ఒక్కడు... డైరెక్ట్ గా వీరు ని పాయింట్ చేసాడు... వీరు కదలకుండా అలానే సైలెంట్ గా నిలబడ్డాడు...
ఈలోపలే ఇంకొకడు వెనుక వచ్చి గన్ను పెట్టాడు... వీరు ఏదో షాక్ అయినట్టు నటించి... చేతులు ఎత్తాడు... వీరు ఒళ్ళంతా వెతికినా ఏదీ దొరకలేదు...
" వీడే .... తీసుకు వెళ్ళండి తీసుకు వెళ్ళండి తొందరగా"
దివ్య సైలెంట్ గా వింటోంది వాళ్ళ మాటలన్నీ... భయంభయంగా