నా ఇల్లాలి ఫ్యామిలి 85
naa telugu kathalu నా ఇల్లాలి ఫ్యామిలి 85 అందరం కలిసి వంట గది మీద పడి తోచిన సహాయం చేయడం మొదలెట్టాము . ఇంట్లో పని వాళ్ళు కూడా లేని కారణంగా మేమే అన్నీ పనులూ చేసుకుంటున్నాం . నా పెద్ద కూతురికి ఇష్టమైన వంటకాలు ఏవి అని తెలుసుకొని , నా తమ్ముడికి ఇష్టమైనవి ఏంటి అని చూసుకొని అన్నీ చేశాం .సరిగ్గా మధ్యాన్నం సమయానికి దగ్గర్లోనే ఉన్నట్టు ఫోన్ చేశాడు నా తమ్ముడు . అందరం మంచిగా బట్టలు వేసుకొని సిద్ధం అయ్యాము . అమ్మ దిష్టి పళ్ళెం సర్దుతుంది , అమ్మమ్మ హారతి ఇవ్వడానికి దీపం వెలిగిస్తుంది .ఇంటి ముందుకి కారు వచ్చి ఆగగానే అందరం పరిగెట్టుకుంటూ బయటకి వెళ్ళాం . నా తమ్ముడు కారు నడుపుతున్నాడు , వెనక అత్తా కోడళ్ళు కూర్చున్నారు . కారులో నుంచి మొదట తమ్ముడు దిగి వెనక తలుపు తీశాడు , నా మరదలితో పాటు నా కూతురు కూడా మమ్మల్ని చూస్తూ సిగ్గు పడుతూ దిగింది .చక్కని ఫ్రాకు వేసుకొని బుట్ట బొమ్మలా నా పెద్ద