నిరుద్యోగి 1
telugu sex stories terasvet.ru నిరుద్యోగి 1 గమనిక – కల్పిత పాత్రలతో ఉండే ఈ కథ ఎవరినీ ఉద్దేశించినది కాదు. ఈ పాత్రలు నిజ జీవితంలో లేరు అని గమనించగలరు. ఇందులోని పేర్లు, పాత్రలు,పాత్రల స్వబావాలు ,సంస్థల పేర్లు కథ కి అనుగుణంగా పెట్టినవి. అంతేగానీ ఎవరి మనోబావాలు కించపరచాలని రాయలేదు.
నిరుద్యోగిగా పయనిస్తున్న ఓ వ్యక్తి జీవితంలో మరో రోజు ప్రారంబమైంది. మంచి మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివినప్పటికి ఉద్యోగం రాని పరిస్తితులలో చల్లని ఉషోదయాన వైజాగ్ సముద్ర తీరంలో ఒడ్డున కూర్చొని అందమైన సూర్యోదయాన్ని చూస్తూ తన జీవితం గురించి ఆలోచిస్తూ ఓ వ్యక్తి ఉన్నాడు. అతని పేరే రవి కుమార్. చామన చాయా వర్ణం తో , సాదారణ పొడవుతో చూడడానికి చక్కగా ఉంటాడు.
ప్రతి రోజు ఆ సూర్యోదయాన్ని చూసి తన రోజు ప్రారంబించే అలవాటు రవికి ఉంది. కానీ ఈ రోజు నుంచి ప్రతీ రోజు ఆ సూర్యోదయాన్ని చూసే అవకాశం ఉంటుందో లేదో. ఆ సముద్రపు అందాలని చివరిగా చూస్తూ ఉన్నాడు. తన చిన్న నాటి నుండి అలవాటుగా మారిన ఆ పనిని వదిలి వెళ్లాలంటే రవి మనసు బాదతో బరువెక్కుతుంది.
జీవితంలో ముందుకు వెళ్లాలంటే పాత అలవాట్లను మాని కొత్త అలవాట్లను ప్రారంబించాలి ఆనే విషయాన్ని రవి కాస్త ఆలస్యంగా అర్ధం చేసుకున్నాడు. ఆ ఆలస్యం వలననే తన జీవితం ఎన్నో ఆటంకాల, చీదరింపుల సమ్మేళనంగా ఉంది. రవిని అర్ధంచేసుకున్న వారు కేవలం ముగ్గురే ఉన్నారు అని అనుకునే వాడు. వారిలో ఇద్దరు రవి అమ్మ మాధవి , నాన్న రఘు. అలగే ఇంకో ముక్య మైన వ్యక్తి రవి సొంత మరదలు శ్రావణి.
రవి జీవితంలో శ్రావణి మొదటి నుంచి లేకపోయినా ఎక్కువగా అర్ధం చేసుకున్న ప్రియురాలిగా బావించాడు. ఆ ప్రియురాలిని జీవిత బాగస్వామిగా చేసుకోవాలని రవి ఎంతో ఆశ పడ్డాడు. కానీ, విధి తన ఆశని అడియశ చేసి, శ్రావణిని రవి జీవితంలో నుంచి పక్కకి నెట్టి , ఆమెను మరొకరి సొంతం చేసింది.
విధి, తన మరదలిని తనకు కాకుండా చేయడానికి ఉన్న ఎన్నో కారణాలలో ప్రదానమైనది ఉద్యోగం లేకపోవడం. చేతగాని తనంతో తన శ్రావణిని దూరం చేసుకున్నాడని మనోవేదన చెందిన రవి, తన జీవితంలో ముందుకు కదల లేక అయోమయ స్తితిలో ఉన్నాడు. అటువంటి స్తితిలో తనకి ఒక ఉద్యోగ అవకాశం రానే వచ్చింది.
ఈ అవకాశం దూరమైతే తన జీవితలో మరో శ్రావణి లాంటి ఇంకో అమ్మాయి కూడా దూరమౌతుందేమో అని ఆలోచలతో interview కి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసమే ఈ రోజు సాయంత్రమే హైదరాబాద్ వెళ్ళడానికి సిద్దమై ఆ సూర్యోదయాన్ని చూస్తూ చివరిగా బరువైన మనసుతో రవి ఇంటికి ప్రయాణమయ్యాడు.
రవి యొక్క అమ్మ నాన్నలు ఓ మద్య తరగతి జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. తిండికి బట్టకి ఇబ్బంది లేని జీవితం ప్రస్తుతం రవి గడుపుతున్నాడు. కానీ అది శ్వాసవతమైనది కాదని తన మనసు చెపుతూనే ఉన్నా, ఇప్పటిదాకా పట్టించుకోని రవి చివరికి తన మనసు మాట వినడానికి సిద్దామయ్యాడు.
( రవి మాటలలో )
నేను ఇంట్లోకి వెళ్ళి హల్లో కూర్చొని ఉండగా , అమ్మ ఇంట్లోకి వచ్చి నాతో మాట్లాడుతూ
“నాన్న, రవీ !! నీ బట్టలు అన్నీ సర్దేశాను. నీ ఇంటర్వ్యూ లెటర్ , certificates మాత్రమే నువ్వు సర్దుకోవాలి. ఇక నువ్వు వెళ్ళి టిఫిన్ తినగానే నాన్న రైల్వే స్టేషన్ లో దిగబెడతా అన్నాడు.”
అని చెప్పి వంటింటిలోకి వెళ్ళిపోయింది. నేను వెళ్ళి నా certificates అన్నీ తీసుకొని file లో పెట్టి బాగ్లో సర్దుకున్నా. ఆ తర్వాత వెళ్ళి టిఫిన్ చేస్తుంటే నాన్న నాతో
“నువ్వేమో Hyderabad లోఉండే ఆ రెండు రోజులూ హాస్టల్ లో ఉంటాను అని అంటున్నావ్ ! అక్కడ మీ మామయ్య ఏమో , ఇక్కడ మేముండగా వాడెక్కడో హాస్టల్ లో ఉండడం ఎందుకు బావ, మేము లేమా. రెండురోజులు కాకపోతే రెండు నెలలు. అయినా మమ్మల్ని పరాయి వాళ్ళు చేశారా. ! అని నన్ను అంటున్నాడు రా . ఇక నువ్వే చెప్పు ఏమంటావ్”
అని నాన్న అంటే , నా పక్కనే ఉండి నాకు టిఫిన్ వడ్డిస్తున్న అమ్మ నాన్నతో
“మీరు ఏమంటున్నారో మీకు అయినా అర్ధం అవుతుందా ! ఆహా , నాకు తెలియక అడుగుతా ! వీడికి జాబ్ లేదనే శ్రావణిని వీడికి భార్యగా ఇవ్వనని మొహం మీదే చెప్పిన మీ బావ, మళ్ళీ ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఉండమంటాడ ”
అని కోపంగా అంటుంటే , నాన్న అమ్మతో “నువ్వు చెప్పేది నిజమే , అంతమాత్రాన బందుత్వాన్ని వదులుకుంటామా ! ఆలోచించు మాదవి”
“మీరు ఎన్నయినా చెప్పండి, వాడు అక్కడ ఉండటం నాకు అంతగా ఇస్టం లేదు”
“సరే ఇదే మాట ,మీ అన్నయ్యకి నువ్వే చెప్పు”
అని ఫోన్ అందుకున్నాడు. మామయ్యతో మాట్లాడటం అంటే అమ్మకి బయం, ఇక అమ్మ ఏమీ చేయలేక నాన్నతో
“సరే , అన్నయ్య తో నేను మాట్లాడలేననే గా మీ ధైర్యం. మీకు ఇస్టం వచ్చినట్టు చేయండి” అని బెడ్ రూమ్ లోకి వెళ్ళిపోయింది. అప్పుడు నాన్న నాతో “ నేను వెళ్ళి మీ అమ్మకి సర్ది చెప్పి నిన్ను రైల్వే స్టేషన్ లో డ్రాప్ చేస్తా”అని నాన్న కూడా టిఫిన్ తినేసి అమ్మ ఉన్న గదిలోకి వెళ్ళాడు.
అక్కడ భార్యతో రఘు మాట్లాడుతూ “చూడు మాదవి , మా బావ తొడరపడి మన సంబందం కాదన్నాడు . అంత మాత్రాన వాళ్ళు మనకి ఏమీ కాకుండాపోతార. అయినా మా బావని పక్కన పెడితే ,నా చెల్లి మంచిదే. అది నీకూ తెలుసు. దాని మనసు బాద పడుతుందే . కాస్త ఆలోచించు.” అని చెప్పి భార్య సమాదానం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇక మాదవి భర్త చెప్పిన మాటలు విని “ సరే , మీ చెల్లిని బాద పెట్టలేక నా బిడ్డ అక్కడ ఉండటానికి ఒప్పుకుంటున్నా”అని చెప్పింది.
ఆ తరువాత రఘు , రవిని తీసుకొని రైల్వే స్టేషన్ కి తీసుకెళ్ళి ట్రైన్ ఎక్కించాడు. ఆ విదంగా రవి Hyderabad కి ప్రయణమయ్యాడు.
( రవి మాటలలో )
12 గం.. ప్రయాణం తరువాత నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో దిగి, నేరుగా మామయ్య ఇంటికి ప్రయాణమయ్యాను. అప్పటికే బాగా రాత్రి అయింది. నేను నేరుగా మామయ్య ఇంటికి వెళ్ళి తలుపు తట్టగానే శ్రావణి డోర్ తెరచింది. నా ముందు నా శ్రావణి ఉంది, కానీ తాను ఒకప్పటి నా శ్రావణి కాదు . వేరొకరి భార్యగా , ఆమే భర్త ప్రతిరూపాన్ని తన కడుపులో మోస్తున్న మరొకరి ఇల్లాలు.
శ్రావణిని చూడగానే తనతో పరిచయం ఉన్న కాలం నా మనసులో ఒక్కసారి మెదిలింది. తానేమీ నా చిన్న నాటి నుంచి నాతో కలసి పెరగలేదు. తనతో నా పరిచయం కేవలం మూడు నెలలు మాత్రమే, కానీ తనకి నాకు అవి ఎన్నో సంవత్సరాలు. అప్పట్లో మా ఇద్దరి మద్య ప్రేమ తప్ప ఎలాంటి శారీరక సంబందం లేదు. మా స్వచ్చమైన ప్రేమ, ప్రేమ గానే ముగుసింది. ఇప్పుడు మా మద్య బావ మరదలు బందం మాత్రమే మిగిలింది.
నన్ను చూడగానే శ్రావణి మొహంలో ప్రకాశవంతమైన వెలుగు, పెదాలపై చిరునవ్వు ,మనస్పూర్తిగా నవ్వినప్పుడు కనిపించే ఆ సొట్ట బుగ్గల అందం నాకు కనిపించాయి. తనని చూసి సరిగ్గా ఏడాది పైనే అయింది. అందుకే తననే చూస్తూ ఉన్నా. నేను ఎందుకు అలా చూస్తున్నానో తెలుసుకున్న శ్రావణి మొహంలో ఆ నవ్వు పోయి బాద మొదలైంది.
శ్రావణి నవ్వుకు కారణం నేనే , అలాగే తన బాదకి కారణం కూడా నేనే. తనలో ప్రస్తుతం ఉన్న ఆ విభిన్న మైన భావాలకి కారణం నేనే అని తెలియగానే అక్కడ క్షణం కూడా ఉండకూడదని అనుకుంటుంటే , అప్పుడే శ్రావణి అమ్మ అయిన అత్తయ్య బయటకి వచ్చింది. అత్తయ్య పేరు మానస. మామయ్య పేరు దామోదర్ .
అక్కడ ఉన్న నన్ను చూసిన అత్తయ్య “వాడిని అలా బయటే నిలబెడతావ శ్రావణి. నువ్వు పక్కకి జరిగితే వాడు లోపలకి వస్తాడు” అని అతయ్యే శ్రావణి ని పక్కక్కి జరిపి నన్ను లోపలకి తీసుకెళ్లింది.
మా కన్నా పై స్తాయి లో ఉండే అత్తయ్య వాళ్ళ ఇల్లు చూస్తూ ఇంట్లోకి వెళ్ళాను. నన్ను ఎలా ఉన్నావో అని కూడా పలకరించకుండానే శ్రావణి తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంది. అప్పటికే బాగా ఆలస్యం అవ్వడంతో అత్తయ్య నాకు భోజనం పెట్టి మిగతా విషయాలు రేపటి రోజున మాట్లాడుకుందాం అని చెప్పి ఒక గది చూపించి అత్తయ్య తన గదిలోకి వెళ్ళింది. అత్తయ్య చూపించిన ఆ విశాలమైన గదిలోకి వెళ్ళిన నేను మంచం మీద ఒక్కడినే పనుకుని రేపటి రోజున జరగబోయే నా ఇంటర్వ్యూ గురించి ఆలోచిస్తూ బారమైన నా కనులను వాల్చి నిద్రపోయాను.