పక్కింటి ఆవిడా
telugu stories kathalu novels పక్కింటి ఆవిడాజీవితం రైలు ప్రయాణం లాంటిది. ఓ కలయిక, ఓ వీడ్కోలు” అన్నారెవరో? ఆమాటలు నిజమనిపించేలా జరిగిందా సంఘటన. తన చెల్లి పెళ్లి సన్నాహాల నిమిత్తం ఓ వారం ముందుగా విశాఖకు బయల్దేరిన శ్రీమతిని ఆ సాయంత్రం గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కించి అలా వీడ్కోలు చెప్పి ఇలా వెనక్కితిరిగానో లేదో…. నవ్వుతూ కనిపించింది వైదేహి."నువ్వేంటిక్కడ?" ఇద్దరినోటా ఒకేమాట."శ్రీమతిని రైలెక్కించేందుకు...." నేచెప్తున్న వాక్యం పూర్తి కాకుండానే, ఆత్రుత ఆపుకోలేక వైదేహి కూడా అనేసింది- "హజ్బెండ్కి వీడ్కోలు చెప్పేందుకు". "నువ్వెలాగున్నావు?""ఇదిగో.... ఇలా!" ఏకకాలంలో మా ఇద్దరి నుంచి మళ్లీ ఓ ప్రశ్న.... ఓ సమాధానం.ఏకవచనం ప్రయోగించుకునే చనువు మా ఇద్దరికీ ఉంది. కారణం, ఒకప్పుడు ఒకే ఊరిలో, ఒకే కాలనీలో కలిసి తిరిగాం, ఒకే స్కూల్, ఒకే కాలేజీ కాకున్నా ఒకే క్లాసు