పల్లెపడుచు palle-paduchu

By | September 6, 2018

ట్టూ కొండలు… పచ్చని పొలాలు, పశువులు, అమాయకంగా కనిపించే ఆ ఊరి ప్రజలు… ఎంతో ఆహ్లాదంగా ఉంది ఆ ఊరి వాతావరణం. ఆర్.టి.సి. బస్సు వచ్చి ఆగగానే తమ లగేజీని తీసుకుని దిగారు సూరి, అజయ్, వెంకట్ లు. వారు బస్సు దిగగానే చల్లని గాలి వారిని తాకుతూ ఆప్యాయంగా ఆహ్వానించింది. వెంకట్ కు ఆ వాతావరణం ఎంతో బాగా నచ్చింది. తను ఇంతవరకూ పల్లెటూరి వాతావరణాన్ని చూడలేదు. అందుకే ఆ చెట్లూ, కొండలూ చూసేసరికి మనసు ఏదో తెలియని అలౌకిక ఆనందానికి గురయ్యింది.