నిశ్శబ్దంగా తన వెనకాల రమ్మని కళ్ళతో చెప్పి వెనుదిరిగింది చామంతి. వెతకబోయిన తీగ కాలికి తగలడమే కాకుండా అది బంగారు తీగలా ప్రకాశిస్తుంటే తనకు పట్టిన అదృష్టానికి తానే గర్వపడుతూ చడీ చప్పుడు కాకుండా మెల్లిగా ఆమె వెనకాల నడిచాడు అజయ్… చిందరవందరగా ఎక్కడ పడితే అక్కడ పడుకుని ఉన్నవాళ్ళకు నిద్రాభంగం కలగకుండా జాగ్రత్తగా నడుస్తూ ఆ ఇంటి గుమ్మం దాటి బయటికి వచ్చారు ఇద్దరూ… బయటంతా కళ్ళు పెద్దవి చేసి చూసినా కానరాని కటిక చీకటి ఆవరించుకుని ఉంది…. అది తనకు మామూలే అన్నట్లు ఆమె ఎలాంటి తడబాటు లేకుండా ముందుకు పోతుంటే… కళ్ళని పెద్దవి చేసి చుట్టూ ఉన్న ప్రదేశాలని చూడ్డానికి ప్రయత్నిస్తూ ఆమె వెనకాలే అడుగులు వేయడం ప్రారంభించాడు అజయ్….
అజయ్ తల పైకెత్తి ఆకాశం వంక చూశాడు. ఆకాశంలో నక్షత్రాలు ఆ చీకట్లో తళతళా మెరుస్తున్నాయి. వాటిని చూసి ఎంతో మైమరిచిపోయాడు అజయ్. సిటీలో డాబాపైన పడుకుని ఎన్నోసార్లు ఆకాశాన్ని చూశాడు అతడు. కానీ ఎప్పుడూ ఇన్నివేల నక్షత్రాలు తళతళా మెరుస్తూ ఎప్పుడూ కనిపించలేదు. బిర్లా ప్లానిటోరియం షో చూస్తున్నట్టుగా అనిపించింది అతనికి…. చామంతి నిశ్శబ్దంగా ముందుకు నడుస్తుంటే ఆమె కాళ్ళ పట్టీలు ఘల్లు ఘల్లు మంటూ శబ్దం చేస్తూ అదో రకంగా వినిపిస్తున్నాయి. అంతలోనే దూరంగా ఎక్కడో ఓ నక్క పెద్దగా ఊళపెట్టడం వినిపించే సరికి… ఉత్సాహంగా చామంతి వెనకాల అడుగులు వేస్తున్న అజయ్ కి వెన్నులోంచి పుట్టుకొచ్చింది వణుకు….
అసలు ఆమె తననెక్కడికి తీసుకువెళుతుందో అర్థం కాలేదతనికి. నోరుతెరచి అడగాలనుకున్నాడు కానీ …. ఆమె ఏమీ మాట్లాడకుండా గంభీరంగా అడుగులు వేస్తుంటే ఆ ప్రశ్న వేయలేకపోయాడు. అంత అందమైన అమ్మాయి అదీ తన మనసుకు నచ్చిన అమ్మాయి అర్థరాత్రి వేళలో తనని నిద్రలేపి ఇలా తీసుకు వెళుతుందంటే…. ఖచ్చితంగా ఆ అమ్మాయికి తనంటే వ్యామోహం కలిగి ఉంటుంది. అసలే తను ఎంతో అందమైన వాడు. పైగా పట్నం నుంచి వచ్చినవాడు. రఫ్ జీన్స్, టీషర్ట్ తో స్టైల్ గా తయారయ్యి ఓరచూపులతో అమ్మాయిల వంక చూస్తూంటే ఈ పల్లెపడుచుల మనసులు మంచులా కరగడంలో ఆశ్చర్యం ఏముంది…? ఆ ఆలోచన రాగానే అజయ్ మనసు ఎంతో ఉప్పొంగిపోయింది.
తన అందానికి ముగ్దురాలయిన ఒక అందమైన మగువ తనతో ప్రణయకార్యాన్ని సాగించడానికి ఇలా ఏకాంత ప్రదేశానికి తీసుకువెళుతుంది… అనే భావన అతని మనసుని స్వప్నలోకాలవైపు పరుగెత్తిస్తోంది. మరి కొద్ది క్షణాల్లో ఈ పల్లెటూరి పడుచుతో తను పొందే సుఖాన్ని తలుచుకునే సరికి అతని శరీరంలో తీయటి పులకింత కలిగింది. వెచ్చటి కోరిక అతని మనసుకి తాకి అల్లరి చేస్తుంటే ఆమెతో గడపబోయే ఆ ఆనందక్షణాలని తొందరగా అందుకోవాలని ఆరాటపడుతూ ఆమె వెనకాలే అదుగులు వేస్తున్నాడు అజయ్… ఇప్పుడు మరొక్క మారు నక్క ఊళ వినిపించినా అతనికి భయం కలగలేదు. ఆ చీకట్లో చెట్లూ, పుట్టలూ దాటుకుంటూ
అరగంట సేపు ప్రయాణించిన తర్వాత ఓ చోట సడన్ గా ఆగిపోయింది చామంతి… ఆమె వెనకాలే మెల్లిగా అడుగులు వేస్తున్న అజయ్ కూడా ఠక్కున ఆగిపోయాడు. ఇద్దరూ అలా నిశ్శబ్దంగా నిలబడిపోయారు. తన ముందే ఉన్న చామంతి రూపం ఆ చీకట్లో కనిపించకపోయినా ఆమె వంటిపై నుండి వస్తున్న ఒక రకమైన సుగంథపరిమళం అతని ముక్కు పుటాలని తాకి మత్తెక్కిస్తోంది…. తనకి నాలుగాడుగుల దూరంలో ఉన్న చామంతిని అమాంతం వెనుక నుండి వెళ్ళి గట్టిగా కౌగిలించుకోవాలన్న కోరికని బలవంతంగా అణుచుకుంటూ … ఆమె నుండి వచ్చే పిలుపు కోసం ఎదురు చూస్తున్నాడు అజయ్….
super video s