ప్రేమాభిషేకం 4
naa telugu kathalu ప్రేమాభిషేకం 4 ఆ రోజు సాయంత్రం ఇంటికి వచ్చాక అమ్మ నాతో ఏమి మాట్లాడలేదు, నాకు తనని అడగాలి అని ఉన్నా భయం వల్ల అడగలేకపోయాను. రాత్రి భోజనానికి పిలిచింది ఇంక మనసులో ఒకటే నిర్ణయించుకున్నా ఈ రోజు ఎలాగైనా విజయ్ కావ్యల విషయం అమ్మని అడిగి తేల్చేయాలి అని భోజనం చేస్తున్నా. తను కూడా నా మనసు చదివిన దానిలా రామ్ ఏదైనా అడగాలి అనుకుంటున్నావా అంది నేను వెంటనే అవును అన్నట్టు తల ఊపాను, సరే అయితే ముందు భోజనం చెయ్యి తరువాత మాట్లాడుకుందాం అని అంది. భోజనం అయిపోయిన వెంటనే నేను రూమ్ లో కి వెళ్ళిపోయాను. అమ్మ మొత్తం పని అంత అయిపోయాక నా రూంలో కి వచ్చి పక్కనే కూర్చుంది, ఇప్పుడు చెప్పు రామ్ ఎదో అడగాలి అన్నావ్ ఏంటది. నాకు మనసులో భయంగానే ఉంది మళ్ళీ ఆ విషయం గురుంచి అడిగితే ఎక్కడ కొడుతుందో అని కానీ ధైర్యం చేసి అడిగాను, ఎందుకు విజయ్ కావ్య ల