ప్రేమాభిషేకం 6
naa telugu kathalu ప్రేమాభిషేకం 6 అమ్మ అంటే ఇంట్లో అందరికి ప్రేమ తాను ఏది కావాలి అని అడిగిన వెంటనే కొని ఇచ్చేవారు తాతయ్య, మావయ్యకి కూడా చెల్లెలు అంటే చాల ప్రేమ అందుకే అమ్మ డిగ్రీ పూర్తైన వెంటనే తన డిపార్ట్మెంట్ లోనే జాబ్ వచ్చేలా చెయ్యాలి అనుకునే వాడు. మావయ్యకి ఉద్యోగం వచ్చిన ఏడాది తరువాత పెళ్లి చేసేసారు. అమ్మ డిగ్రీ పూర్తై మంచి సంబంధాలు చూసే టైంలోనే సడన్ గా మా తాతయ్య గుండెపోటుతో చనిపోయాడు, సర్వీస్ లో ఉండగా చనిపోవడం వలన ఇంట్లో ఎవరో ఒకరికి ఆయన ఉద్యోగం వస్తుంది అని రఘుపతి తాతయ్య చెప్పాడు కానీ మావయ్య కి పోలీస్ ఉద్యోగం ఇష్టం లేదు అందుకే అమ్మని ఒప్పించి ఆ ఉద్యోగం తనకి వచ్చేలా చేసారు. ఆలా అమ్మ కి పోలీస్ ఉద్యోగం వచ్చిన ఏడాది లోనే నాన్న దుర్గా ప్రసాద్ తో వివాహం జరిగింది 2 ఏళ్ల తరువాత నేను పుట్టాను, కానీ నేను పుట్టిన ఏడాది తరువాత నాన్న ఒక ఆక్సిడెంట్ లో