ప్రేమాభిషేకం 7
naa telugu kathalu ప్రేమాభిషేకం 7 ఇంక నాకు అప్పటినుండి అన్నయ్య అభి మాత్రమే, మా వదిన కూడా నాతో చాలా ప్రేమగా ఉండేది తన తోబుట్టువు లానే చూసేది, వాళ్ళకి ఇద్దరు కూతుర్లు అవడం వలన అభిని తమ కన్న బిడ్డలా పెంచుకుంటాం ఇచ్చేయమని అడిగేవారు ఆలా చేస్తే నా పెళ్లి చేయడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అని అన్నయ్య అభిప్రాయం, కానీ తల్లి ప్రేమ వలన వాడిని వదులుకుని దూరంగా ఉండలేక మళ్ళీ పెళ్లి అనే మాటను ఇప్పటివరకు ఊహించలేదు. అన్నయ్య చాలా సార్లు ఆ ఉద్యోగం మానెయ్యమని తనతో తిరుపతి వచ్చేస్తే అక్కడ తన డిపార్ట్మెంట్ లోనే జాబ్ చూస్తాను అనే వాడు, కానీ నాకు అమ్మనాన్న ఉన్న ఇంటిని వదిలి వెళ్లడం ఇష్టంలేక ఈ ఊరిలోనే ఉండిపోయాను పైగా తమ సొంత కూతురులా చూసుకునే పిన్ని బాబాయ్ ఇక్కడే ఉండడం వలన నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అయిపోయింది. కానీ ఎంతైనా భర్త పోయిన ఆడది అంటే ఈ సమాజమే