రాజ్య సింహాసనం 23 రమణయ్య ఆ లేఖ తీసుకుని చదివిన తరువాత ఆదిత్యసింహుడి వైపు అందోళనగా చూస్తూ, “ఏంటి ప్రభూ….ఈ విపరీతం…మీరు వివాహమాడాల్సిన ప్రభావతీదేవి గారిని మీ అన్నగారు వివాహమాడటం ఏంటి…అదీ మహారాణీ గారు దగ్గర ఉండి చేయించడం ఏంటి,” అనడిగాడు.ఆదిత్యసింహుడు : అదే నాకూ అవగతం కావడం లేదు రమణయ్య గారు….ఏం చేయాలో పాలుపోవడం లేదు….రమణయ్య : ఈ లేఖలో వివాహముహూర్తం ప్రకారం ఇంకా రెండు రోజులు ఉన్నది…మనం ఎంత వేగంగా బయలుదేరినా కామపురరాజ్యానికి వెళ్ళడానికి కనీసం మూడు రోజులు పడుతుంది…ఈ లోపు వివాహం అయిపోతుంది….ఆదిత్యసింహుడు : కనీసం ఈ రహస్యం ప్రభావతికి, నాకూ తప్ప ఆమె తండ్రికి కూడా తెలియదు…అయినా ప్రభావతి మా అన్న గారితో వివాహానికి ఎలా అంగీకరించినది…..రమణయ్య : ఏం జరిగిందో తెలియకుండా మన నిర్ణయానికి రావడం మంచిది కాదు ప్రభూ….(అంటూ ఆదిత్యసింహుడి వైపు చూస్తూ) అయినా కామపుర రాజ్య యువరాణి సబంధం మహారాణీ కళావతి గారికి ఎలా తెలిసింది….రమణయ్య అలా అనగానే ఆదిత్యసింహుడికి తను విరించి చేత రాయించిన లేఖ గుర్తుకొచ్చింది.దాంతో ఆదిత్యసింహుడు వెంటనే విరించిని పిలిపించాడు.ఆదిత్యసింహుడు : విరించీ…నేను మహారాణి గారికి రాయించిన లేఖ ఎక్కడున్నది….విరించి : అది ఆరోజే మన దూత ద్వారా మహారాణి గారికి పంపించాను ప్రభూ….ఆదిత్యసింహుడు : మరి నేను నా వ్యక్తిగత అధికార ముద్ర వేయకుండా ఎలా పంపించారు….విరించి : వేయలేదా….నేను చూసుకోలేదు ప్రభూ…మీరు ముద్ర వేసారు అనుకున్నాను…అదీ కాక మీరు అత్యవసరం అనే సరికి నేను దాన్ని వెంటనే పంపించాను….ఆదిత్యసింహుడు : నువ్వు చేసిన పని వలన ఎన్ని విపరీతాలు జరగబోతున్నవో చూడు….(అంటూ రమణయ్య చేతిలోని లేఖను విరించికి ఇచ్చాడు.)ఆ లేఖ చదివిన విరించికి వెన్నులో నుండి వణుకు పుట్టుకొచ్చింది.అతనికి ఏం చేయాలో తోచలేదు.దాంతో అతను వెంటనే ఆదిత్యసింహుడి కాళ్ళ మీద పడిపోయి,
ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి