రంగుల ప్రపంచం 2
telugu stories kathalu novels రంగుల ప్రపంచం 2 పాటు సుగంధమైన సువాసనని కూడా అంతటా వెదజల్లుతున్నాయి.
గోడలపైన అక్కడక్కడా అమర్చిన పెయింటింగ్స్ ఫ్రేమ్స్ ని చూసి కోమలి మనసు ఎంతో ఆనందపరవశంతో తేలియాడింది. హాలులో ఒక పక్కగా ఉన్న ఆక్వేరియంలో రంగు రంగుల చేపలు నీటిలో అటూ ఇటూ కదులుతూ చూడటానికి ఎంతో ముచ్చట కలిగిస్తున్నాయి. కొమలికి ఆ గదిలోకి రాగానే స్వర్గంలోకి వచ్చిన ఫీలింగ్ కలిగింది. ఆమె ఆశ్చర్యంగా గదులను పరిశీలించడం చూసి తనలో తానే చిన్నగా నవ్వుకున్నాడు ‘’ఎలా వుంది ఈ అతిథి గృహం’’ కొమలిని చూస్తూ అన్నాడు అనూప్. కోమలి ఎంతో ఎగ్జిట్ మెంట్ గా … ‘’ఇంత అద్భుతమైన డిజైనింగ్ తో ఖరీదైన వస్తువులతో ఎంతో అందంగా మెరిసిపోతున్న ఈ గదుల్ని చూస్తుంటే నిజంగా స్వర్గ లోకంలోకి వచ్చానే అనిపిస్తుంది. ఇంత అందమైన గదుల్ని సినిమాలలో తప్పితే నిజంగా నేనింతవరకూ చూడలేదు’’ అంది కోమలి.
‘’స్టార్ హోటల్స్ లో ఉండే గదుల ప్రత్యేకత ఇదే మరి. ఇక్కడకు వచ్చే కష్టమర్స్ లని ఆనందడోలికలలో తేలిపోయేలా చేయడమే వారి లక్ష్యం. ఇక నుండి నువువ్ ఉండవలసిన చోటు ఇదే’’ నవ్వుతూ అన్నాడు అనూప్. ‘’నిజంగానా ….?’’ అందమైన ఆమె కళ్ళని పెద్దవిగా చేస్తూ కనురెప్పల్ని టపటపలాడిస్తూ ఆశ్చర్యంగా అంది కోమలి. అంతలోనే ఆమెకి ఏదో అనుమానం కలిగింది …. ‘’ఇంత ఖరీదైన హోటల్ లో నెలరోజులు ఒక్కదానినే ఉండాలా …?’’ ఆమె అడిగిన ప్రశ్నకు కాస్త తటపటాయించినా తనని తాను సర్ధుకుని ‘’నెలరోజులూ నువ్విక్కడే వుంటే ప్రొడ్యూసర్ టి.వి. సీరియల్ కి పెట్టె ఖర్చునంతా ఈ హోటల్ బిల్లు కట్టడానికే సరిపోతుంది’’ అంటూ చిన్నగా నవ్వి … ‘’ఉన్న ఫళంగా మీకు వసతి ఏర్పాట్లు చేయడం అంటే కొంచెం కష్టమే కదా … ఒకమంచి రూంని మంచి