రంగుల ప్రపంచం 3
telugu stories kathalu novels రంగుల ప్రపంచం 3 తనలోని టాలెంట్ కి తగ్గట్టుగా తన అందాన్ని నమ్ముకుని మంచి నటిగా తనని తాను ప్రూవ్ చేసుకోవాలని ఇంట్లో నుండి చెప్పాపెట్టకుండా హైదరాబాద్ కి రావడం … వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లు అనూప్ తో పరిచయం కావడం …. డైరెక్టర్ ఆనంద్ తనని చూసి హీరోయిన్ గా బుక్ చేయడం … ఆ హోదాలో ఒక ఫైవ్ స్టార్ హోటల్లో తను బస చేయడం … ఒకటొకటిగా వెంట వెంటనే జరిగిపోతుండటంతో ఆమెకి అంతా కలలో లాగానే అనిపిస్తోంది. నిజంగా అనూప్ ఎంత మంచివాడు! తనని చూసిన ప్రతివాడు చొంగకారుస్తూ దొంగ చూపులు చూసే వాడే …. కాలేజీలో చేరిన మూడు సంవత్సరాల్లో మూడు వందల లవ్ లెటర్స్ ని అందుకుంది కోమలి. ఆమె కాలేజీలోకి ఎంటర్ అయిందంటే చాలు ప్రతి ఒక్కరూ ఏదో ఒక సాకుతో తన శరీరాన్ని తాకాలని ప్రయత్నించిన వారే. ఇక తన అందంతో ఆటలడుకోవాలని చూసిన వారే …
అలాంటి వారందరికంటే అనూప్ ఎంతో బెటర్ అనిపించింది కొమలికి. తను అతనికి పరిచయం అవ్వగానే అతను అన్న మాటలు గుర్తుకు వచ్చాయి … ‘’మీరు సిన్సియర్ గా నటించి, అంకిత భావంతో ముందుకు సాగిపోతూ ఎదగాలని అనుకుంటున్నారా? లేదంటే అడ్డదార్లు తొక్కుతూ అందలం ఎక్కాలనుకుంటున్నారా?’’ ఈ ప్రశ్న వేయగానే అయోమయపడింది తను. దానితో అనూప్ మళ్ళీ ‘’మీరు కష్టపడి పైకి రావాలనుకుంటే కొంచెం సమయం పడుతుంది. అదే రెండో మార్గం ఎన్నుకుంటే … ఈ రోజు రాత్రికే ఏ ప్రొడ్యూసర్ దగ్గరికో… డైరెక్టర్ దగ్గరికో తీసుకు వెళతాను …. రాత్రంతా వారికి స్వర్గాసుఖాలని అందిస్తే తెల్లారగానే నిన్ను మహారాణిలా తెరమీద ఆవిష్కరిస్తారు ….’’ అతను సూటిగా చెప్పిన మాటల్ని, అతనిలోని నిజాయితీని