సంవేద ఒక అమ్మాయి కధ 10
telugu stories సంవేద ఒక అమ్మాయి కధ 10 "ఓహ్ నువ్వా అన్నాడు ఆనందంగా "ఛ ఎంత పొరపాటు జరిగిపోయింది. అనవసరం గా సారీ చెప్పాను ఎవరికో డాష్ ఇచ్చా అనుకొని."
ఏమన్నావ్"
"ఏమన్నాను అనవసరం గా సారీ చెప్పాను అన్నాను. అసలు నువ్వే అని చూసుంటే ఇంకొంచం అందంగా డాష్ ఇచ్చే వాడిని. మంచి అవకాశం చేజారిపోయిందే అని బాధ పడుతున్నా" అన్నాడు కొంచం గడుసు గా
"ఛ నీతో మాట్లాడడం నాది బుద్ధి తక్కువ రా రేవ వెళ్దాం అంది" కాని కైళాష్ దారిలో డోర్ కి అడ్డంగా నిల్చునేసరికి వెళ్ళడానికి దారి కనిపించలేదు. వాళ్ళిద్దరూ హోటల్ ఎంట్రీ పాయింట్ దగ్గర నిలబడ్డారు. అక్కడ ఒకళ్ళ తరువాత ఒకళ్ళు వెళ్ళడానికే ప్లేస్ ఉంటుంది . తలుపు కి దగ్గరగా కైలాష్ ఇటు తిరిగి నిల్చున్నాడు అతనికి ఎదురుగా వేద ఉంది.
"కొంచం అడ్డు తప్పుకుంటావా"
"అరే ఎందుకు అంత తొందర. కొంచం సేపు మాట్లాడొచ్చుగా. అయినా