సంకెళ్లు 1
telugu sex stories terasvet.ru సంకెళ్లు 1 తెలుగు రాష్ట్రంలోని పలానా జిల్లాలో పలానా మండలం కింద ఉన్న పన్నెండు గ్రామాలకి కలిపి ఒకే రోడ్డు.. ఎటు చూసినా చల్లటి గాలి పచ్చటి వాతావరణం ఇప్పుడిప్పుడే ఎదుగుతూ ఉన్న ఊర్లు డాబాలు, రెండంతస్తుల ఇళ్ళు పడుతున్న రోజులవి.
ఐదో గ్రామం దాటి ఆరో గ్రామం బోర్డు చూసి నాన్న ట్రాక్టర్ ని ఊళ్లోకి పోనించారు, నేలసముద్రం అని రాసి ఉంది బోర్డు మీద. మా అమ్మ ముందు నాన్న పక్కన కూర్చుంటే నేను నా ఇద్దరు తమ్ముళ్ళతో వెనక సామానుతో పాటు కూర్చున్నాను.
"ఎప్పుడు డైరీ రాస్తూ ఉంటుంది అందులో ఎం రాస్తుందో ఏమో పుస్తకాలు పుస్తకాలు నింపేస్తుంది" అన్న తమ్ముడు గొంతు వింటూనే పేజీ తిప్పి మళ్ళి రాయడం మొదలు పెట్టాను, కొత్త సంవత్సరం, కొత్త డైరీ. ప్రతీ సంవత్సరం లాగే కొత్తగానే పరిచయం చేసుకుంటాను. నా పేరు భారతి, మొన్ననే గవర్నమెంట్ స్కూల్లో చదువు పూర్తి చేసుకున్నాను. ఇంక చదివించనని నాన్న మొహం మీదే చెప్పేసాడు, నాకు ఇష్టం లేదు కానీ నోరు తెరిస్తే వీపు చీరేస్తాడని తెలుసు అందుకే మౌనంగా తల ఆడించాను. ఇంతకీ మీకు ఈ ఊరు ఎందుకు వచ్చామో తెలీదు కదా పెద్దగా కారణం ఏమి లేదు, బతుకుదెరువు కోసం ఊళ్లు పట్టుకుని తిరుగుతూ ఉంటాం అలా ఇది ఇంకో ఊరు.
అదిగో ట్రాక్టర్ నడుపుతున్నాడే ఆయనే మా నాన్న, పేరు రఘు. కష్ట పడనిదే మాకు పూట గడవదు అందుకే ఆయన్ని చూడగానే అవతలి వాళ్ళని భయపెట్టేలా ఉంటాడు, పక్కనే కూర్చుంది మా అమ్మ పేరు రజిత, నాన్నతో పాటే పొలం పనులకి వెళుతుంది, తనకి ఆరోగ్యం బాగున్నప్పుడల్లా వెళుతుంది ఎక్కువగా పత్తి కొలవడం, మిరపకాయలు ఒలవడానికి వెళుతుంది. ఇక నాకు ఇద్దరు తమ్ముళ్లు పెద్దొడి పేరు సంపత్ చిన్నోడి పేరు సిద్దు. వీళ్ళిద్దరే నా లోకం. ముగ్గురం బెస్ట్ ఫ్రెండ్స్ లాగా అన్యోన్యంగా ఉంటాం చెప్పాలంటే నాకు ఇద్దరు బాడీ గార్డ్స్ అన్నమాట.
ఇంతలో మేము ఉండాల్సిన చోటు వచ్చేసరికి అమ్మ వేసిన కేకకి డైరీ లోపల పెట్టేసి కిందకి దిగి ఒక్కో సామాను తమ్ముళ్లు అందిస్తుంటే నేను అద్దెకి దిగిన గుడిసెలో సర్దుతున్న అమ్మకి అందించాను. త్వర త్వరగా సామాను దించేసి అమ్మ వాళ్ళు సర్దుతుంటే నేను తమ్ముడు కలిసి పొయ్యి వెలిగించే పనిలో పడ్డాము, చిన్నోడేమో వాడి టైర్ తీసుకుని ఆడుకోడానికి వెళ్ళిపోయాడు, అమ్మ వాళ్ళ పని ఐపోయేసరికి అన్నం వండి చారు కాసాను సప్పగా ఉన్నా తప్పక తినేశారు. నాలుగు రోజుల్లో ఊరు సంగతి అర్ధమైపోయింది ఇక్కడ అందరూ వలస పక్షులే సొంతంగా ఇళ్ళు కట్టుకున్నవారెవ్వరు అంతగా కనిపించలేదు. తమ్ముళ్లు ఇద్దరు బడికెళ్లారు, అమ్మ నాన్న పొలానికి నేనేమో వీళ్ళకి వంట వార్పు చూసుకోడానికి ఇంట్లోనే. మధ్యాహ్నం వచ్చి అందరూ అన్నం తినేసి వెళితే గిన్నెలు కడుక్కొని ఒక నిద్ర వేసేదాన్ని లేచి మళ్ళీ బియ్యం కడిగి పెడితే ముందు బడికెళ్లిన నా తమ్ముళ్లు ఆ తరువాత అమ్మ నాన్నా వచ్చేసి ఏడు ఏడున్నర దాటే లోపే అన్నం తినేసే వాళ్ళం.. ఏం తోచనప్పుడు మాత్రం తమ్ముళ్ళ పుస్తకాలు చదివేదాన్ని
ఏంటి మీ నాన్నేమో మాములు కవులు రైతు ఆ రోజుల్లోనే మీరు బియ్యం తిని బతికే వాళ్ళా అని అనుమాన పడకండి, మా నాన్న అంతే ఆయన చిన్నప్పటి నుంచి డబ్బు లేక చాలా అవమానాలు పడ్డారట మా నాన్న పెళ్లయ్యాక కూడా చుట్టాలు మా నాన్నని తక్కువగా మా అమ్మని చులకనగా మాట్లేడే వారట దాన్ని పంతంగా తీసుకుని అక్కడ ఉన్న తన వాళ్లందరిని వదిలేసి వేరే కాపురం పెట్టాడు. చావనైనా చస్తాడు కానీ మాకు తిండికి ఎప్పుడు ఏ లోటు రానివ్వడని అమ్మ చెప్పింది. ఆయన కష్టం చూసి మాకు ఆయనంటే భయంతో పాటు గౌరవం కూడా. ఉన్న రోజు బియ్యం లేని రోజు సంగటితో కానిచ్చే వాళ్ళం. ఈ కొన్ని రోజుల్లోనే నా పనులు నాకు అలవాటు అయిపోయాయి అప్పుడప్పుడు అమ్మాలక్కల మాటలు వినడానికి చెట్టు కిందకి వెళ్లేదాన్ని కానీ అవి నా చెవికి రుచించేవి కాదు, నేను మొదటి నుంచి అంతే పక్క వారి గురించి ఎవరైనా చెడుగా మాట్లాడితే నాకు నచ్చదు, నాలాగా ఎవరైనా ఉండి ఉంటే బాగుండు అనుకునే రోజుల్లోనే నాకు మధురిమ పరిచయం అయ్యింది, అదీ చెట్టు కిందే పేరు బాగుంది కదా నాక్కూడా నచ్చింది.
అమ్మా నాన్నా పొలానికి వెళ్ళాక తమ్ముళ్లు బడికి వెళ్ళేవారు అంతే ఇక గుడిసెకి తాళం వేసి చెట్టు కిందకి వెళ్లేదాన్ని నాకోసం మధు అప్పటికే కూర్చుని ఉండేది, నా కంటే చిన్నది కదా కోపం వచ్చినా నేనంటే ఇష్టమవడంతో సర్దుకుపోయేది. రోజు రోజుకి మా స్నేహం ముదిరిపోయింది ఎంతలా అంటే ముచ్చట్లలో ఆటల్లో పడి ఒక రోజు మధ్యాహ్నం పూట అన్నం వండటం మర్చిపోయాను దానికి కానుకగా మా అమ్మ చేతిలో చీపిరి దెబ్బలు. ఆ తరువాత మా అమ్మకి మధుని పరిచయం చేసాను తనకి కూడా మధు నచ్చింది ఏమనలేదు కాని "మీ లోకంలో పడి మమ్మల్ని పస్తులు పెట్టకండే" అంది.
రోజులాగే చెట్టు కింద కూర్చుని మాట్లాడుకుంటున్నాం.
మధు : భారతి అక్కా, రేపు మనూళ్ళో పెళ్లుంది మధ్యాహ్నం అమ్మోళ్ళు అన్నం తినేసాక వెళదామా?
భారతి : మా అమ్మకి తెలిసిందనుకో నిన్ను నన్ను చీరేసిద్ది.
మధు : హా, సరేలే (అని కొంత సేపు మౌనంగా ఉండి) అయినా తెలుస్తుందా ఏంటి, ఎవ్వరికి తెలీకుండా జనాల్లో కలిసిపోయి తినేసి వద్దాం ఏమంటావ్?
భారతి : వద్దే మధు, అవి పెద్ధింటోళ్ల పెళ్లిళ్లు మనల్ని ఇట్టే గుర్తు పట్టేస్తారు, ఎందుకోచ్చిన గొడవ చెప్పు.
మధు : నేను అదే అనుకున్నానే కానీ చికెన్ అనేసరికి, నోరు ఆగట్లా
భారతి : చికెనా నిజంగానా?
మధు : మరి అదే కదా నేను చెప్పేది.
భారతి : ఏదైనా ఉపాయం ఉంటే తప్ప కష్టం మధు.
మధు : ఉపాయం లేదు ఉల్లిగడ్డ లేదు, రేపు మనం వెళుతున్నాం అంతే.
భారతి : అంతే అంటావా?
మధు : అంతే, అమ్మ వాళ్ళు వెళ్ళిపోగానే తయారయ్యి వచ్చేస్తా నువ్వు కూడా మీ వాళ్ళు వెళ్ళిపోగానే వచ్చేయి సరేనా?
భారతి : సరే సరే, ఆమ్మో మా వాళ్ళు వచ్చేస్తారెమో నేనళతా.
మధు : నేనూ వెళ్ళాలి టాటా, రేపటి విషయం మర్చిపోకు
భారతి : అలాగేలే.. అని ఇంటికి వచ్చి ఆలోచనలో పడ్డాను ఎప్పుడు నీసు గురించి మాట్లాడుకోడమే గాని తిన్నది లేదు.
తెల్లారి లేచి పనులన్నీ చక చకా చేసేసాను, అమ్మా నాన్న పొలానికి వెళ్లిపోయాకా చిన్నోడు ఇవ్వాళ స్కూలుకి వెళ్లనని మొండికేసాడు, ఇలా జరిగేందేంటా అనుకున్నాను అదే విషయం మధుకి చెప్తే వాడిని కూడా తీసుకు రమ్మంది. నాకు భయం వేసినా చివరికి సిద్ధు గాడిని వెంట పెట్టుకుని పెళ్లికి వెళ్లాను. అందరూ భోజనాలు చేస్తుంటే మేము కూడా లోపల భయంగా ఉన్నా ధైర్యంగా ఉన్నట్టు వెళ్లి కూర్చున్నాం, సిద్దు గాడికి ఏ పట్టింపు లేదు వాళ్ళు కూడా హడావిడిలో ఉన్నారో మా జాతకం బాగుందో ఏమో అందరితో పాటే మాకు వడ్డించారు. ఎవ్వరు గమనించక ముందే చక చకా తినేసి ముగ్గురం బైటపడ్డాం. ఇంటికి నడుచుకుంటూ వెళుతుంటే మధు వెళ్లి సోడాబుడ్డి తాత దెగ్గర సేమ్యా ఐస్ కొనుక్కోచ్చింది ముగ్గురం తింటూ ఇంటికి నడుస్తున్నాం.
మధు : భలే ఉంది కద అక్కా
భారతి : ఆమ్మో మొత్తానికి నువ్వన్నది నెగ్గించుకున్నావే, ఎంత భయం వేసిందో.. తినేటప్పుడు ఇంత భయపడతానని ఎప్పుడు అనుకోలేదు. మధు ఇలాంటి పనులు మనం ఇంకెప్పుడు చెయ్యకూడదు.
మధు : అలాగే అక్కా, అమ్మ తోడు ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి ఆలోచనలు చెయ్యను నాకు భయం వేసింది నన్ను నమ్ము.
భారతి : రేయి సిద్దు, ఇంట్లో చెప్పకూడదు సరేనా.. రేయి నిన్నే
మధు : వాడు ఆ ఐస్ అయిపోయేదాకా మనల్ని పట్టించుకోడు.
భారతి : వీడు ఇంట్లో చెపితే అంతే
మధు : చెప్పడు లే, రే సిద్దు ఎవ్వరికి చెప్పొద్దు సరేనా, చెప్తే ఇంకెక్కడికి తీసుకెళ్ళము.
సిద్దు : సరే
వాడు ఏ ముహుర్తాన ఏ లోకంలో ఉండి సరే అన్నాడో కానీ అమ్మ వాళ్ళు రాగానే వెళ్లి జరిగింది మొత్తం అమ్మకి పూస గుచ్చినట్టు చెప్పేసాడు, అమ్మ నన్ను ఒంగోబెట్టి గుద్దింది, నాన్న అమ్మని ఆగమని చెప్పి నన్ను పిలిచాడు.
రఘు : చికెన్ బాగుందా
భారతి : నాన్న క్షమించు, ఇంకెప్పుడు ఇలా చెయ్యను అని కాళ్ళ మీద పడిపోయాను నా కన్నీళ్లు ఆయన కాళ్ళ మీద పడ్డాయనో ఏమో నన్నేమి అనలేదు.
రఘు : పో వెళ్లి పని చేసుకో, రేపు ఒకసారి మధ్యాహ్నం పూట ఆ అమ్మాయిని కూడా రమ్మను.
భారతి : ఎందుకు నాన్న తన తప్పు లేదు, నేనే పెద్దదాన్ని నేను చెప్తేనే...
రఘు : నేనేం అనను లే, ఊరికే నీ స్నేహితురాలిని నాకు కూడా పరిచయం చెయ్యి.
భారతి : భయపడుతూనే అలాగే నాన్న అని బైటికి పరిగెత్తాను.. సిద్దు గాడు నన్ను చూసి భయపడుతుంటే వాడిని దెగ్గరికి తీసి ఉప్పు ఎక్కించుకుని వాడి భయం పోగొట్టాను.
తెల్లారి నాన్న పొద్దున్నే బైటికి వెళ్ళాడు, అమ్మని అడిగితే నవ్వింది కానీ ఏమి చెప్పలేదు, నేను మధు వాళ్లంటికి వెళ్లి పిలుచుకొచ్చా.
మధు : నాకు భయంగా ఉందే, ఎం చెప్పావ్?
భారతి : నేనేం చెప్పలేదు, నాకూ భయంగానే ఉంది.
ఇద్దరం మాట్లాడుకుని ఇంటికి వెళ్లకుండా ఎం చెయ్యాలా అని ఆలోచించుకుని అక్కడా ఇక్కడా తిరిగి ఎలా అయినా తప్పదు అనుకుని నేను మధు ఇద్దరం ఇంటికి వెళ్ళాము.
రజిత : ఎప్పుడు వెళ్ళావ్ ఎప్పుడు వస్తున్నావే, మీ కోసం అందరం ఎదురు చూస్తున్నాం, అమ్మా మధు ఇద్దరు కాళ్ళు కడుక్కుని రండి భోజనం చేద్దురు.
ఇద్దరం కాళ్ళు కడుక్కుని లోపలికి వెళ్లి కూర్చున్నాం సిద్ధు గాడు మధుని చూడగానే లోపలికి పరిగెత్తాడు, అమ్మ బలవంతంగా పిలిస్తే వచ్చి కూర్చున్నాడు. నాన్న వచ్చి కూర్చోగానే అమ్మ అందరికి అన్నం వడ్డించింది.
సిద్ధు : ఆయి చికెన్...!
అమ్మ అందరికి వడ్డించింది, నేనూ మధు ఒకరి మొహాలు ఒకరం చూసుకున్నాం అంతే తినడం మొదలు పెట్టాము ఆవురావురమంటూ.
రఘు : భారతి..
భారతి : హా.. నాన్న..
రఘు : మనం ఒక్క పూట చికెన్ తినడానికి అయిన ఖర్చు ఎంతో తెలుసా?
భారతి : ఎంతా?
రఘు : నా రెండు రోజుల సంపాదన.
ఆ మాట వినగానే నా నోట్లోకి ముద్ద పోవడానికి చెయ్యి లేవలేదు సరికదా బాదేసింది.
రఘు : ప్రతీ నెలా చికెన్ తెచ్చుకుందాం కానీ మీరు ఇంకోసారి ఇలా వెళ్లమని నాకు మాట ఇవ్వండి.
భారతి : క్షమించు నాన్న
మధు : నేనే..
రఘు : చిన్న పిల్లలు మీ తప్పు లేదు, కానీ పిలవని వాటికి వెళ్లి మన గౌరవం అస్సలు తగ్గించుకోకూడదు సరేనా
భారతి : లేదు నాన్న, ఇంకోసారి ఇలాంటి తప్పు చెయ్యము.
రజిత : మధు తిన్నాక ఇద్దరు వెళ్లి అందరికి ఐస్ తీసుకురండి అని నవ్వింది.
ఆరోజు నుంచి మధు మా ఇంట్లో కలిసిపోయింది, ఒక్కటే కూతురు అవ్వడం, అందులోనూ మా నాన్న మధు వాళ్ళ నాన్న స్నేహితులు అవ్వడంతో ఎవ్వరు అభ్యంతరం చెప్పలేదు. నలుగురం ఒక జట్టు అయిపోయాం. నేను సిద్ధు ఒక జట్టు, మధు సంపత్ ఒక జట్టుగా ఉండేవాళ్ళు, ఆటల్లో మాత్రమే.
ఆ యేడు వ్యవసాయంలో నష్టం వచ్చింది, మేమంతా మళ్ళీ బియ్యం నుంచి రాగి సంగటికి వచ్చేసాం అంతే నాన్న వ్యవసాయం వదిలేసి వలస కూలి పనికి వెళ్ళిపోయాడు, అమ్మ మాత్రం పొలం పనులకి వెళుతూ ఉండేది. నాలుగేళ్లు గడిచాయి నాన్న కూలివాడి నుంచి మేస్త్రి అయ్యాడు అప్పు చేసి చిన్న స్థలం కొనుక్కున్నాం.
సంపత్ ఇంటర్ అయిపోవస్తుంది, సిద్దుగాడు పది పరీక్షలకి సిద్ధం అవుతూ ఉన్నాడు, మేము ఎంత అల్లరి చేసినా తమ్ముళ్లు ఇద్దరినీ చాలా జాగ్రత్తగా చదివించే దాన్ని, వాళ్ళు కూడా అంతే నాన్న ఇంటికి వచ్చినప్పుడు ఆయన ఒంటి మీద దెబ్బలు కాలికి గుచ్చుకున్న మేకుల మచ్చలు చూసి ఒళ్ళు దెగ్గర పెట్టుకుని ఉండేవాళ్ళం.
అదీ కాక మా పక్కింట్లో ఉన్న బ్రహ్మం గారింట్లో టీవీ ఉండేది, కలర్ టీవీలు వచ్చి చాలా ఏళ్ళు అయినా కానీ చాలా ఖరీదు చేసేవి, ఒక రోజు చిన్నోడు టీవీ చూడాలని వాళ్ళ ఇంటి కిటికీ నుంచి తొంగి చూస్తుంటే బ్రహ్మం గారి భార్య మొహం మీదే కిటికీ వేసేసింది, సిద్దు అవమానపడి ఏడ్చుకుంటూ వచ్చి నాకు చెప్పాడు. చదువుకుని ఉద్యోగం తెచ్చుకుంటే దాని బాబు లాంటి టీవీ కొనుక్కుందాం అని చెప్పా, అప్పటి నుంచి వాడికి చదువు మీద కసి పుట్టింది.. తెగ చదివేవాడు.. అలా రోజులు గడుస్తున్నాయి ఒక రోజు అమ్మ పిలిచింది.
రజిత : భారతి.. ఇలా రా అని పిలిచి నన్ను కూర్చోబెట్టుకుని వాటేసుకుంది.. కొన్ని నెలలు మనకీ కష్టాలు తప్పవు నేను కూడా ఇంట్లో ఎక్కువగా ఉండటం కుదరదు, ఇంటి బాధ్యత నువ్వే తీసుకోవాలి చిన్నోడిని పెద్దొడికి ఏది మంచి ఏది చెడు అన్ని నువ్వే దెగ్గరుండి నేర్పాలి సరేనా.. నేనేం చెప్తున్నానో అర్ధం అవుతుందా
భారతి : ఇప్పుడు నేను చేసేది అదే కదే.. మళ్ళీ అర్ధంకావడానికేముంది?
రజిత : నీ బొంద.. నీకు పెళ్లి చేద్దామనుకుంటున్నాం అదే చెప్తున్నా, ఏమి అర్ధంకావు మట్టి బుర్ర.
భారతి : పెళ్ళా.. నాకా..?
రజిత : హా.. పెళ్లే...నీకే.. నాన్నతో పాటు పని చేసే అతని తమ్ముడి కొడుకట. అమ్మా నాన్న లేరు, మంచి వాడట డిగ్రీ చదివి పట్నంలో పని చేస్తున్నాడట నీకిచ్చి చేద్దాం అని నాన్నని అడిగారట.. అబ్బాయికి అమ్మా నాన్న కూడా లేరు నువ్వు కాపురానికి పట్నం వెళ్లిన నాలుగు నెలలకి పెద్దొడి ఇంటర్ పూర్తి అవుద్ది చిన్నోడి పది పూర్తి అవుద్ది వాళ్ళ చదువలకి ఎలాగో పట్నం వెళ్ళిపోవాలి. నువ్వు వెళ్లిన నాలుగు నెలలకి మేము కూడా వచ్చేస్తాం.
భారతి : మిమ్మల్ని వదిలి ఉండలేనమ్మా, నాకు వద్దు.
రజిత : అలాగంటే ఎలాగే, మళ్ళీ ఇలాంటి సంబంధం రాదు, ఆ అబ్బాయి కూడా మనతో కలిసి ఉంటానని మాటిచ్చాడట.. ఒక్క నాలుగు నెలలు ఓర్చుకోవే తల్లి.
భారతి : భయంగా ఉంది అమ్మా.
రజిత : పది పరీక్షలు అయిపోగానే చిన్నోడిని నీకు తోడుగా పంపిస్తా సరేనా అని ముద్దు పెట్టుకుని ఇదిగో మీ హీరో సినిమా రుద్రవీణ రిలీజ్ అయ్యింది వెళ్లి రండి.
భారతి : యే.. రేయి సంపత్ పదండి ఆటకి వెళదాం.
సంపత్ : రుద్రవీణ బాగుందంట నా ఫ్రెండ్స్ చూసేసారు నేనే నీకోసం ఆగిపోయాను.
భారతి : ఇదిగో అమ్మ డబ్బులు ఇచ్చింది, రేయి సిద్దు నువ్వెళ్ళి మధుని పిలుచుకురా.
సిద్దు : ఇదిగో వెళుతున్నా
నలుగురం సినిమా చూసి చిరంజీవి గురించి మాట్లాడుకుంటూ ఇంటికి వస్తుంటే గుర్తొచ్చి చెప్పాను అమ్మ వాళ్ళు పెళ్లి చేస్తున్నారని, ముందు ఆనందపడితే ఆ తరువాత బాధ పడ్డారు నాకు మాత్రం భయం వేసింది. చూస్తుండగానే రోజులు గడవటం నాకు పెళ్లి అయిపోవడం కట్నకానుకలు, ఏడుపులు, అప్పగింతలు.. నన్ను పట్నంలో దిగబెట్టి అమ్మ వాళ్ళు వెళ్లిపోవడం కూడా జరిగిపోయింది, సిద్దు పది రోజులు ఉన్న తరువాత అమ్మ వచ్చి తీసుకెళ్లిపోయింది.
ఆయన పేరు దినేష్ కొంచెం సున్నిత మనస్కుడు మొదటి రాత్రి నేను భయపడి ఏడ్చేస్తే నన్ను చూసి నవ్వి దూరం జరిగాడు. ఒక నాలుగు నెలలు నన్ను ముట్టుకోలేదు నన్ను నవ్వించాడు, అమ్మ వాళ్ళు గుర్తొచ్చి ఏడిస్తే అదే రోజు నన్ను ఊరికి తీసుకొచ్చాడు నాకు పూర్తి నమ్మకం వచ్చి నాకు నేనుగా ఆయనని ముట్టుకునేంత వరకు నన్ను ఇబ్బంది పెట్టలేదు ఆ తరువాత నేను అలవాటు పడ్డాను. ఇద్దరం సంతోషంగా ఉంటున్నాం ఒకరి ఇష్టాలు ఒకరికి అర్ధం అవుతున్నాయి, అప్పుడప్పుడు నేను తగ్గితే నేను నిన్ను ప్రేమిస్తున్నాను నేను తగ్గలేనా అన్నట్టు నటించేవారు.
నాలుగు నెలలకి వచ్చేస్తామన్న అమ్మ వాళ్ళు రాకుండా పెద్దొడిని పంపించారు డిగ్రీ చదువుకుంటాడని. పెళ్లికి అయిన అప్పులు తీర్చే పనిలో ఉన్నారని నాకు నేనే సర్ది చెప్పుకున్నాను. నేను, సంపత్, మా ఆయన ముగ్గురం చాలా బాగా ఉండేవాళ్ళం. వచ్చిన చిక్కల్లా సినిమా దెగ్గరే ఆయనేమో బాలకృష్ణ ఫ్యాన్ మేమేమో చిరంజీవి ఫాన్స్. ఆయన కోసం మేమిద్దరం ఇష్టం లేకపోయినా బాలకృష్ణ సినిమాలకి వెళ్లాల్సి వచ్చేది, అది అయనకీ తెలుసు కానీ మమ్మల్ని ఏడిపించడానికి కావాలని తీసుకు వెళ్ళేవారు.. మేమూ సినిమా బాగున్నా కూడా కావాలని నిద్ర పోయేవాళ్ళం. సినిమా అయ్యి ఇంటికి వచ్చాక బాలయ్యని పొడిగి చిరంజీవి ఫాన్స్ కూడా బాలయ్య సినిమా చూస్తారు అని జోకులు వేసేవాడు.. తప్పదు భరించాలి.సిద్దు గాడు వస్తే మాత్రం మా ఆయన తగ్గుతాడు ఎందుకంటే చిరంజీవిని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే అస్సలు సహించడు.
చిన్నగా మా ఆయనకి దెగ్గర అయ్యాను, ఆయన నన్ను ఎంత ప్రేమిస్తారో తెలుసుకున్నను.. బదులుగా కూతురు పుట్టింది, ప్రణీత అని పేరు పెట్టుకున్నాడు మా ఆయన, కొడుకు పుడితే మాత్రం నేనే పేరు పెట్టుకుంటానని మొండి పట్టు పడితే మాట ఇచ్చాడు.. చూస్తుండగానే పెద్దొడి డిగ్రీ అవ్వడం, అప్పటికే చిన్నోడు డిగ్రీ జాయిన్ అవ్వడం. అమ్మా నాన్నా చెప్పినట్టే పట్నం వచ్చేయడం అన్ని జరిగిపోతున్నాయి కానీ ఒక్క మనిషి మాత్రం నా ఆలోచనల్లో మిగిలిపోయింది నా మధు, దాని మాటలు లేకపోతే బాగోలేదు ఏదో వెలితిలా ఉంది.
పట్టు పట్టి నా తమ్ముడిని ప్రేమగా ఒప్పించాను, ఇంట్లో మాత్రం నానా తంటాలు పడి ఏడుపులు పెడబొబ్బలు పెట్టాను, నా తమ్ముడికి మధుకి అభ్యంతరం లేదు కానీ పెద్ద వాళ్ళని కూడా ఒప్పించి మధుని నా తమ్ముడు సంపత్ కి ఇచ్చి పెళ్లి చేసాను. అందరం కలిసే ఉంటున్నాం పెద్దొడు పై చదువులు అని ఉద్యోగం చేస్తూనే చదువుతున్నాడు. చిన్నోడి డిగ్రీ కూడా అయిపోవస్తుంది.. ఈ లోగా నా కొడుకు ఈ భూమ్మీద అడుగు పెట్టాడు.
అందరికంటే సిద్దుకి వాడంటే ఎక్కువ ఇష్టం.. నేను కాన్పుతో ఉన్నప్పుడు అందరూ ఉద్యోగాలలో పడ్డారు, ఒకరికి ఇద్దరు తోడు అయినట్టు మా నాన్నకి మా ఆయన, తమ్ముడు తొడయ్యారు ఎదిగే పనిలో ఉన్నారు.. అప్పుడు నా పక్కన ఉన్నది సిద్దు గాడే.. అదీ కాకా నా నుంచి బిడ్డని బైటికి తీసాక రక్తపు ముద్దని పట్టుకొమ్మని వాడి చేతిలోనే పెట్టింది డాక్టర్ దానితో వాడంటే సిద్దు గాడికి ఏదో తెలియని ప్రేమ.
ఇంటికి వచ్చిన మూడు నెలలకి అందరూ ఏం పేరు అని అడిగితే మా వారు నా మొహం చూసారు, నేను నా కొడుకుని చూసి నా ఇద్దరు తమ్ముళ్ళని పిలిచాను. ముగ్గురం ఒకరి మొహాలు ఒకరం చూసుకుని అందరి వైపు తిరిగి "చిరంజీవి" అంటూ నవ్వుతూ మా వారి వైపు చూసాం.
దినేష్ : అరెరే.. అనవసరంగా మాట ఇచ్చానే బాలకృష్ణ అని పెట్టుకోవాల్సింది. అని నవ్వాడు.
సిద్దు : ఇంకా నయ్యం.. రేయి చిరు.. ఇటు చూడు.
భారతి : వీడి పేరు చిరు అయినా చిన్నా అని పిలుచుకుంటాను.
సిద్దు : ఎందుకలాగ?