శోభనం తర్వాత పెళ్లి 31
telugu stories kathalu novels శోభనం తర్వాత పెళ్లి 31 వీళ్ళిలా మాట్లాడుకుంటుండగానే.. నిర్మల ఇంటి పాలేరు హేమ ఇంటికి వొచ్చి అమ్మా నిర్మలమ్మగోరూ.. మిమ్మల్నీ, చెల్లెమ్మగారినీ.. వున్నపళంగా వెంటబెట్టుకుని అయ్యగారు చెప్పేరండి.. తొందరగా ఇంటికి పదండమ్మా .. అంటూ నిర్మల పాలేరు నిర్మలనీ.. సరితనీ తొందరపెట్టేడు..
వురుములేని మెరుపులా వూడిపడి తొందరచేస్తున్న తమ ఇంటిపాలేరుమీద చికాకుపడుతూ.. నిర్మల.. ఏంటిరా ఆ తొందర.. వున్నపళంగా ఇప్పుడు ఇంటికివొచ్చినంత మాత్రాన అక్కడ అంత కొంపలు మునిగిపోయే పనులేమున్నాయని..? అంటూ నిర్మల పాలేరుని విసుక్కుంటుంటే.. దానికి వాడు..
లేదమ్మగారూ.. మిమ్మల్నీ మీ చెల్లెలిగారినీ చూసుకోవడానికి పట్నమ్నించీ ఎవరో పెళ్ళికొడుకు తల్లితండ్రులు వొచ్చేరంట.. అందుకే అక్కడ అమ్మగారూ.. అయ్యగారూ.. మీరెక్కడికి వెళ్ళేరో అని ఖంగారుపడుతుంటే.. మీరు ఇక్కడ హేమమ్మగారి ఇంట్లో వుంటారని చెప్పి అమ్మగారు నన్నిక్కడికి తోలేరండి.. వినయంగా సమాధానం చెప్పేడు పాలేరు..
ఇంట్లో పెళ్ళిసంబందం కోసమని పెళ్ళికొడుకు తల్లితండ్రులువొచ్చి కూర్చున్నారన్న మాట విని.. నిర్మల.. సరితా.. అక్కడున్న అందరి ముఖాలలోకీ.. ఆశ్చర్యంగా చూసేరు.. అకడున్న ఆడవాళ్ళందరి ముఖాలూ సంబ్రమాశ్చర్యాలతో ఒకరకమైన కాంతితో వెలిగిపోయేయి..
ముందుగా ఆ ఆశ్చర్యంనించీ తేరుకున్న సరిత.. పాలేరుని చూస్తూ.. నీవెనకాలే మేము వొస్తున్నాము .. ముందు గా నువ్వు ఇంటికి పరిగెత్తుకెళ్ళి అమ్మావాళ్ళని ఖంగారు పడొద్దని చెప్పు అని