శోభనం తర్వాత పెళ్లి 37
telugu stories kathalu novels శోభనం తర్వాత పెళ్లి 37 హేమ తండ్రి మాటలువిన్న నీల తల్లితండ్రులు, నీల పెళ్ళిచూపులుకూడా హేమా వాళ్ళ ఇంట్లో హేమతోపాటే జరిపించడానికి.. అన్నీ కుదిరితే నీల తాంబూలాలూ పెళ్లి ముహూర్తాలు కూడా అక్కడే పెట్టించుకోవడానికీ నిర్ణయం చేసుకున్నారు.
పొలం వ్యవహారం చూడ్డానికని వొచ్చి కొడుకులిద్దరికీ పెళ్లికూతుళ్ళనీ.. తన కుటుంబానికి మంచి కోడళ్ళనీ సంపాదించుకున్నందుకు హేమ తండ్రి స్నేహితుడు సంతోషంగా సాయంకాలం తిరుగు ప్రయాణం కడుతూ దెగ్గరలో మంచిరోజు చూసుకుని ఆడపిల్లలని తన కొడుకులకి, భార్యకీ చూపించడానికి కుటుంబసమేతంగా తరలి వొస్తామని మాటఇచ్చేడు.
హేమ కుటుంబం వల్ల నీల పెళ్ళికుదిరినందుకు నీల తల్లితండ్రులు ఆనందిస్తే,