ఒకరోజు సాయంత్రం మావారు ఆఫీస్ నుండి వస్తూ, తన కూడా ఒక నలభై ఐదేళ్ళ వ్యక్తిని వెంటబెట్టుకొని వచ్చాడు. “ఈయన పేరు గిరి. దూరపు బంధువు. వరసకి అన్నయ్య అవుతాడు” అని పరిచయం చేసాడు. ఆయనకి అన్నయ్య అంటే, నాకు బావ వరస అవుతాడు. పెళ్ళయిన ఇంతకాలం తరవాత, మా ఇంటికి వచ్చిన మొదటి బంధువు అతను. ఆ ఆనందం దాచుకోకుండా, “బావగారూ! రండి..” అని లోపలకి ఆహ్వానించాను. అతను నవ్వుతూ తన సూట్ కేస్ తో లోపలకి వచ్చాడు. అతని నవ్వు చూస్తే, ఏదో తేడాగా అనిపించింది. నాకే తేడాగా అనిపించిందా? లేక, అతను నిజంగానే తేడానా!? “ఏమైనా కొంచెం జాగ్రత్తగా గమనించాలి.” అనుకుంటూ, కిచెన్ లోకి వెళ్ళాను, వాళ్ళకి కాఫీ తేవడానికి. వాళ్ళిద్దరూ హాల్ లో కూర్చొని ఉన్నారు.
కాఫీ కలుపుతూ ఉన్నానే గానే, ఎందుకో మనసంతా కంగారుగా ఉంది. ఎందుకో తెలియడం లేదు. బహుశా, మా ఆయన కూడా వచ్చిన “బావ” గురించే కావొచ్చు. అంతలోనే, “పాపం! అనవసరంగా అతని గురించి కంగారుపడుతున్నానా!? అలా ఆలోచించకూడదు.” అని నాకు నేనే సర్ధిచెప్పుకుంటూ