వంశాచారం 44
naa telugu kathalu వంశాచారం 44 తన ప్రాణాలను సైతం విడవడానికి తెగించిన భద్రుడు దుడుకుగా వ్యవహరించకుండా కాలావకాశం కోసం ఎదురు చూడటానికి ముఖ్య కారణం ఆ రాజ్యం లో రాజ ద్రోహులని , దేశ ద్రోహులని , యజమానులు మోసం చేసే స్వామి ద్రోహులని , దోపిడీ దారులని ,గజదొంగలని, పసి వారు & ఆడవారి పై బలాత్కారానికి పాల్పడే నీచులను"ఘోర కలి " అనబడే చెరసాల లో పడేసేవారు.అది చెరసాల అనడం కన్నా భూలోక నరకం అనటమే సబబు. అక్కడ ఖైదీల కు విధించే శిక్షలు ఘోరాతి ఘోరం గా వుండి మల్లి ఎవరన్నా తప్పు చెయ్యాలంటే వెన్నులో వణుకు పుట్టే విధం గా ఉండేవి.ఆ చెరసాల పరిసరాలు అంతా కుళ్ళిన జంతు మనుష్య మలము మాంసములతో నిండి ఇరవై నాలుగు గంటలూ అక్కడ విధించబడిన శిక్షలకు ఆ ఖైదీలు చేసే ఆర్తనాథలతో ఆ ప్రాంత పరిసరాలు మారుమోగుతుండేది . అక్కడి సైనికులు భయానకమైన ముఖ కవచాలు ధరించి విచిత్రమైన శబ్దాలు చేస్తూ యమలోకం లోని యమా భటులను తలపించేవారు.అక్కడ ఖైదీలను కనీసం ఒక నూరు దినాలు అయినా చావనీయకుండా చూస్తూ , ప్రతి రోజు వాడి శరీరం