విజయ్ ఒక భర్త కథ 10
telugu stories kathalu novels విజయ్ ఒక భర్త కథ 10 అంతే గట్టిగా డిసైడ్ అయిపోయాను Death will set me free అని... నాకు తెలుసు ఇది చాలా పెద్ద తప్పు అని అందుకే పెద్దగా ఆలోచించడం లేదు ఎందుకంటే నేను ఆలోచించే కొద్దీ ఖచ్చితంగా వేరే ఆప్షన్స్ దొరుకుతాయి కానీ నేను ఈ ఆప్షన్ ఏ కావాలనుకుంటున్నాను పిరికి వాళ్ళు మాత్రమే సూసైడ్ చేసుకుంటారు అని విన్నాను అందుకే ఇంకా కొద్ది సేపటి వరకు నన్ను నేను పిరికి వాడిని అనుకుంటా పోయేదేముంది అనుకున్నాను...
అంతా బాగానే ఉంది కానీ ఇప్పటికే చీకటి పడిపోయింది ..అది నేషనల్ హైవే కాబట్టి వచ్చేపోయే వాహనాలు స్పీడ్ డబల్ అయింది ఇంత చీకట్లో నాకు తినడానికి దాబాలు ఉంటాయేమో గాని చావడానికి రైల్వే ట్రాకులు లాంటివి ఎక్కడ వెతకాలి అనుకుంటుండగా పక్క సీట్లో ఫోన్ వైబ్రేట్ అవ్వడం చూసి ఇది Switch off చేసేదాకా నన్ను వదిలేలా లేరు అనుకొంటూ ఫోన్ను అందుకోడానికి పక్కకి వంగాను. అంతే ఎప్పుడొచ్చిందో ఒక లారీ వెనక నుండి బలంగా ఒక్క గుద్దు గుద్దింది… వెంటనే కారు గాల్లోకి ఎగిరి పక్కనే ఉన్న పొదల్లోకి దూసుకెళ్లింది 10 సెకన్లలో అంతా జరిగిపోయింది కారు డోరు ఎలా తెరుచుకుందో నేను ఎలాఎగిరి బయట పడ్డానో కానీ చూస్తే కారు నాకు చాలా దూరంగా పడి పోయింది రోడ్డు వైపు చూస్తే లారీ వాడికి ఇదంతా బాగా అలవాటైన పని లాగా ఉంది ఏదో లోడ్ ని క్రేన్ తో పక్కకు నెట్టి వెళ్లిపోయినట్లు క్యాజువల్గా వెళ్ళిపోయాడు.. నాకు దెబ్బలు ఎక్కడెక్కడ తగిలాయ తెలియదు కానీ ఒంట్లో ఏ పార్ట్ కదలట్లేదు ఒంటి నిండా రక్తం కారుతోందని మాత్రం తెలుస్తోంది… ఛీ దీనమ్మ జీవితం నా బతుకు మీద దేవుడికి కూడా అసహ్యం వేసినట్టుంది అందుకే ఇలా అనుకున్నానో లేదో