విజయ్ ఒక భర్త కథ 6
telugu stories kathalu novels విజయ్ ఒక భర్త కథ 6 ఫకీర్: నీలో ఉన్న ఏకైక లోపం ఇదే అన్ని భావాలను లోపలే దాచుకుంటావు అందుకే ఎప్పుడు ఎలా బయటికి చెప్పాలో తెలియని అయోమయ స్థితికి చేరుకున్నావు..
నీ భార్య సంతోషంగా ఉండాలి కానీ అది నీతో కలిసి పంచుకునే సంతోషం అంతేనా ??
విజయ్: అవును.. అవును.. అవును బాబా.. అంతే అదే కావాలి నాకు.
ఫకీర్ : హుమ్మ్... అది చాలా కష్టమే కానీ అసాధ్యం కాదు. అది జరగాలంటే నువ్వు కొన్ని పనులు చేయాలి ఎందుకు ఏమిటి అని అడగకూడదు చేయగలవా ??
విజయ్: చేస్తాను.. ఏదైనా చేస్తాను.. నా ప్రాణాలైనా ఇస్తాను చెప్పండి ఏం చేయాలి నేను అన్నాడు.
ఫకీర్ : అన్నిటికంటే నువ్వు మొదటిగా చేయాల్సింది అదే అన్నాడు.
విజయ్ కి అర్థం కాలేదు ఏంటి బాబా??
ఫకీర్ : విజయ్ చచ్చిపోవాలి అదే నువ్వు మొదటగా చేయాల్సింది..
విజయ్ కి నోట మాట పడిపోయింది కళ్ళు పెద్దవి చేసి నోరు తెరిచి అలానే చూస్తుండిపోయాడు.. చాలా సేపటి తర్వాత తేరుకొని అక్కడున్న మంచి నీళ్ల గ్లాసు తీసుకొని గటగట మొత్తం తాగేశాడు.
ఫకీర్ నవ్వుతూ చెప్పాను కదా నువ్వు ఇది చెయ్యలేవు అని
ఇప్పుడు విజయ్ వేగంగా ఆలోచించడం మొదలు పెట్టాడు అతనికి ఇప్పటికే ఫకీర్ తో జరిగిన అనుభవాల ద్వారా అతనిమీద గట్టి నమ్మకం ఏర్పడింది అతను ఏం చెప్పినా అందులో నిగూడంగా ఇంకొక