అమ్మాయి ప్రేమ పరిణయం 47

By | March 22, 2020
telugu stories kathalu novels అమ్మాయి ప్రేమ పరిణయం 47 "ఓ అయితే మాట్లాడలేదనమాట సరే వదిలేసెయి నీకు మీ తాతయ్య గురించి బాధ లేకపోయినా నేను అలా చూస్తూ చూస్తూ నా స్నేహితుడిని పోగొట్టుకోలేను. వాడు మధ్యాహ్నం కూడా అన్నం తినలేదు నీకు కనీసం బాధ్యత అయినా లేదు. ఉంటే ఫోన్ అయినా చేసేవాడివి. ఇప్పటివరకూ నీకు చాలా సార్లు చెప్పి చూసాను అయినా నువ్వు వినట్లేదు. వాడి పరిస్థితి నీతో మొరపెట్టుకోవడం కన్నా గోడలతో మొరపెట్టుకోవడం నయం కనీసం మనసులో భారమైనా తగ్గుతుంది. నువ్వు మరీ ఘోరంగా తయారయ్యావు. ఇంక నీతో ఈ విషయం మాట్లాడడం అనవసరం. నువ్వు ప్రణవితో మాట్లాడతావో లేదో నీ ఇష్టం కానీ నేను మాత్రం ఆ అమ్మాయి ఎక్కడ ఉందో వెతికి పట్టుకొని ఆ అమ్మాయితో మాట్లాడతాను. అంతగా అవసరమనుకుంటే వాడి పరిస్థితి చెప్పి వాడి కోసమైనా ఇంటికి రమ్మని చెప్పి వెళ్ళి బతిమిలాడుకుంటాను. ఆమె ఎంత మూర్ఖురాలైనా ఒక ప్రాణం పోతూ ఉంటే చూస్తూ ఉంటుందని నేను అనుకోను. మీ తాతయ్య కన్నా నీకు నీ పట్టుదలే ముఖ్యమని నాకు అర్ధం అయ్యింది. మీ ఇద్దరి మధ్య జరిగిన గొడవల్లో మీ తాతయ్య కి ఏం సంబంధం అని ఆయన్ని అంతగా బాధపెడుతున్నావు. అసలు మీరిద్దరూ ఎందుకు కలిసుండడం లేదో నీకే తెలియాలి. నీకు నీ పట్టుదలకి ఒక నమస్కారం. నీ పట్టుదల కోసం నేను వాడి ప్రాణాన్ని తియ్యలేను. ఈ విషయం నీకు చెప్దామని మాత్రమే ఫోన్ చేసాను. ఉంటాను" అని కోపంగా పెట్టేసారు యశ్వంత్ "తాతయ్య" అని పిలుస్తున్నా వినిపించుకోకుండా. యశ్వంత్ తల పట్టుకొని కూర్చున్నాడు. తను ఇంకా ఏం చెయ్యకుండా అలా ఆలోచిస్తూ కూర్చుంటే పరిస్థితి చెయ్యి దాటిపోతుందని అతనికి అర్ధం అయ్యింది. ఈ విషయం లో ముక్త తో మాట్లాడదాం అనుకున్నాడు. కానీ ఎలా మాట్లాడాలో అర్ధం కాలేదు చాలా సేపు ఆలోచించాక ఒక నిర్ణయానికి వచ్చాడు. ముక్త ని పిలుద్దామనుకున్నాడు కానీ టైం చూసేసరికి ఏడు దాటింది ఈ పాటికి వెళ్ళిపోయుంటుందని రేపు

పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *