ధర్మేచ అర్థేచ..1

By | April 15, 2020
telugu stories kathalu novels ధర్మేచ అర్థేచ..1 రాత్రి తొమ్మిదిన్నర గంటలు దాటుతోంది సమయం. 'దయచేసి వినండి.. ట్రైయిన్ నెంబర్ ఒకటి ఏడు రెండు అయిదు ఆరు..' లేడీ ఎనౌన్స్‌మెంట్ మూడు భాషల్లో ఖంగున వినిపిస్తోంది. అసలే సంక్రాంతి రోజులు. ఊర్లువెళ్ళే జనాల్తో క్రిక్కిరిసి ఉంది సికింద్రాబాద్ రైల్వేస్టేషన్. ప్రతిసంవత్సరం సంక్రాంతి రోజుల్లో ఈ రసాభస అనుభవమే నాకు. అందుకే ఈసారి ముందుగానే బెర్త్ రిజర్వ్‌చేసుకున్నాను. మిడిల్ బెర్తొచ్చింది. బోగీ, సీటు నెంబరు చూసుకుని ఆ జనసందోహాన్ని దాటి నా సీట్లోకొచ్చిపడ్డాను. అటూఇటూ మగవాళ్ళు. నైటేకదా అరగంట్లో ఎవరి బెర్తుల్లోకి వాళ్ళెళ్ళిపోతార్లే అనుకుంటూ కూర్చున్నాను. ఎవరో ఒకతను అప్పుడే వచ్చి, నా పక్కనున్న అప్పర్ బెర్తతన్ని తనకి ఎక్కడోవచ్చిన లోయర్లోకి వెళ్ళమని రిక్వెస్ట్ చేస్తున్నాడు. 'లోయర్ని దానం చేసి అప్పర్ తీసుకుంటున్నాడా..!' ఆశ్చర్యం..!! సీట్ ఛేంజయ్యారు వాళ్ళు. వచ్చినతను నాప్రక్కన కూర్చుని నన్నేచూస్తూ, మాటలు కలపాలని ప్రయత్నిస్తున్నాడు. పక్కనే ఇలాంటి చూపుల్ని ఫేస్ చెయ్యలేక, లోయరడిగితే మిడిలిచ్చిన ముక్కూమొహం తెలీని ఆన్‌లైన్‌ప్రోగ్రాంని తిట్టుకున్నాను. కృష్ణాజిల్లాలోని ఓ పల్లెటూర్నుంచి హైటెక్‌సిటీకొచ్చి, ఒంటరిగా ఉంటూ, పదులమంది మగాళ్ళమధ్య ఉద్యోగం చేస్తూకూడా, ఇప్పుడు ఒకపూట ప్రయాణంలో పక్కన మగవాళ్ళున్నారని జంకుతుండడం నాకే వింతనిపించింది. టిక్కెట్ చేత్తోపట్టుకుని నెంబరు చూసుకుంటూ ఒకతను, అతని పక్కన మరో ఇద్దరు మగాళ్ళు వచ్చారు ఎదుటి బెర్తుల్లోకి. 'ఖర్మ.. కూపే అంతా మగాళ్ళేనా..' అనుకుంటుంటే సైడ్ అప్పర్ మీదకి ఎక్కుతూ కనిపించిందొకావిడ. 'గుడ్డికంటే మెల్ల మేలన్నట్టు... సైడ్ అప్పర్ కంటే మిడిల్ చాలా

పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *