ఈ రాత్రి నీకు బహుమతి 21

By | February 18, 2019
ఇలా శ్రీనివాసరావుకి, రాధకీ మధ్య కొత్త సంబంధం ప్రారంభమైంది. వాళ్ళిద్దరికీ కుదర్చడం వరకే తిప్పరాజు పని అయిపోలేదు. ఆ తరువాత కూడా తిప్పరాజు పాత్ర కంటిన్యూ అయింది. ఎంత చిన్న అవసరం వచ్చినా శ్రీనివాసరావు తిప్పరాజు మీద ఆధారపడేవాడు. ఇద్దరి మధ్య మెసేజ్ లు అందజేయడం దగ్గర్నుంచి, ఎక్కడ కలుసుకోవాలో అన్న ప్లేస్ ల నిర్ణయం వరకు తిప్పరాజే చేసేవాడు. అతను తెలివైన వాడు కావడం వల్ల చొరవ వున్న వాడవడం వల్ల వాళ్ళిద్దరికీ సుఖపడడం తప్ప మరి ఎలాంటి అవాంతరాలు లేకపోయాయి. ఇలాంటి కొత్త సంబంధాలు ఎంత జాగ్రత్తగా వున్నా, దాగవు. శ్రీనివాసరావుకీ, రాధకీ మధ్య ఎంతో కొంత అనుబంధం ఏర్పడిందని వూరు వూరంతా పసిగట్టేసినా అదెంత గ్రేడ్ లో వుందో మాత్రం ఎవరికీ ఖచ్చితంగా తెలియదు. వూరు చెవులు కొరుక్కుంటున్న సమయంలో వూరి పెద్దకూ ఈ విషయం తెలిసింది. వృద్దుల ఆశ్రమానికి స్థలం ఇచ్చే విషయంలో ఆయన పునరాలోచనలో పడ్డాడు. అలాగని స్థలం ఇవ్వనని బ్లెంట్ గా రాధకు చెప్పలేకపోయాడు. నిజానిజాలు తెలుసుకున్న తరువాత నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించుకుని నన్ను పిలిపించారు. "ఇద్దరూ ఈ వూరు కాదు. ఈ వూర్లో చాలాకాలం వుండే అవకాశం వుండడం వల్ల వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి సంబంధం కొనసాగుతుందో నాక్కావాలి. సాక్ష్యాదారాలతో నువ్వు దాన్ని నిరూపించాలి" అని ఆయన నాకు కేసు అప్పగించాడు. సరేనని ఒప్పుకున్నాను. రెండోరోజు నుంచి దర్యాప్తు ప్రారంభించాను. పని ఒప్పుకున్న తరువాత తప్పదు కదా. రోజూ సాయంకాలం పక్క వూరు కెళ్ళి రాత్రి బాగా పొద్దుపోయే వరకు అక్కడే వుండి వచ్చేదాన్ని. ఎవర్ని  

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

One thought on “ఈ రాత్రి నీకు బహుమతి 21

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *