ఈ రాత్రి నీకు బహుమతి 23
అతను జితేంద్రని స్పష్టంగా తెలుస్తూనే వున్నా ఎవరో తెలియనట్టు "ఎవరూ?" అని ప్రశ్నించింది.
"నేను జితేంద్రను" అతను తఃప్పు చేసినవాడిలా మెల్లగా చెప్పాడు.
"ఇంటికి వెళ్ళలేదా? ఇంతవరకు ఏం చేస్తున్నావిక్కడ?"
"వెళ్ళాను పన్నెండు గంటలకు లేచి వచ్చాను"
"ఎందుకు?"
"ఈ రోజు నా పుట్టినరోజు"
"అయితే?"
"పన్నెండు దాటగానే మిమ్మల్ని చూడాలని"
అంటే తను మేల్కొనే వుంటుందని ముందే వూహించాడా? అంతే కదా మరి- 'ఐ లవ్ యూ' అని చెప్పిన తరువాత తనకు నిద్రొస్తుందని ఎవరూ అనుకోరు. జితేంద్ర మరింత తెలివయినవాడు కనుక సులభంగానే గ్రహించి వుంటాడు. అయినా రాత్రంతా నిద్ర మేల్కొని మొదటిసారి తనను చూడాలనుకోవడం ఏమిటి పిచ్చి కాకపోతే. ఆ పిచ్చే ఆనందం కాబోలు ప్రేమికులకు.
"ఈ రోజు నీ పుట్టినరోజు! ఏమైనా ప్రెజెంటేషన్ ఇవ్వాలని వున్నా ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదే" అంది కావాలనే మాట మార్చాలనే ఉద్దేశంతో కానీ అదే ఆమెకు సరికొత్త సమస్యను తెచ్చిపెట్టింది.
"నిజంగా ప్రెజెంటేషన్ ఇస్తారా?" అతను ఎంత ఆశపడుతున్నాడో అతని గొంతే చెబుతోంది.
ఆమెకు ఏం చెప్పాలో పాలుపోలేదు. అందుకే అవునూ కాదూ అన్నట్టు తల ఊపింది.
Super