అమ్మాయి ప్రేమ పరిణయం 39
telugu stories kathalu novels అమ్మాయి ప్రేమ పరిణయం 39 అతను ఆమె దగ్గరికి వచ్చేసరికి ఆమె సిస్టం లో లీనమై టైప్ చేస్తూ కనిపించింది. ఆమె దగ్గరికి వస్తూనే పక్క డెస్క్ నుండి ఒక కుర్చీని తెచ్చుకొని ఆమె పక్కనే వేసుకొని కూర్చున్నాడు. ఆమె టైప్ చేస్తున్నప్పుడు ఆమె చేతి వేళ్ళ వంకే చూస్తున్నాడు. అవి పొడుగ్గా అందంగా ఉన్నాయి. పార్టీకి వెళ్ళడానికి గోళ్ళకి నెయిల్ పాలిష్ వేసిందేమో ఆ కలర్ ఆమెకి బాగా సూట్ అయ్యింది. అతనలా ఆమె టైప్ చేసేది చూస్తుంటే ఆమెకి కంగారులో సెంటెంస్ ఫార్మేషన్ సరిగ్గా కుదరడం లేదు. అన్నీ తప్పులొస్తున్నాయి. వాటిని డిలీట్ చేస్తూ మళ్ళీ రాస్తూ ఉంది. ఒక పారాగ్రాఫ్ రాయడానికే ఆమెకి పది నిమిషాలు పడుతోంది.
"ఇలా డాక్యుమెంట్ చేస్తే ఇవాళ కనీసం ఒక్క పేజ్ కూడా అవ్వదేమో ఇంక పూర్తి డాక్యుమెంట్ ఎప్పటికి అవుతుంది" అన్నాడు ఆమె చేస్తున్న దాన్ని గమనిస్తూ
ఆ మాటతో ఆమెకి కోపం వచ్చి "ఇప్పటిదాకా బానే డాక్యుమెంట్ చేసా మీరొచ్చాకే ఇలా.." అంది ఉక్రోషంగా
"ఓ...అయితే తప్పంతా నాదే నంటావు..అయినా నేనేం చేసాను" అన్నాడు అమాయకంగా
అతని మాట తీరు చిత్రంగా ఉండేసరికి ఆమె అతని వైపు తల తిప్పి చూడకుండా ఉండలేకపోయింది. అతని మొహం లో నవ్వు కదలాడుతోంది. ఆమె అలా చూడగానే అతని మనసు గిలిగింతలు పెట్టింది. "ఏంటివాళ ఈ అమ్మాయి ఇంతందంగా కనిపిస్తోంది" అనుకున్నాడు. అతనలా నవ్వుతుంటే ఆమె వెంటనే తల తిప్పేసుకుంది. అతనలా చూస్తుంటే డాక్యుమెంటేషన్ చెయ్యడం కష్టంగా ఉంది. అప్పటివరకూ బాంబే ప్రాజెక్ట్ కి సంబంధించిన డాక్యుమెంటేషన్ పూర్తయిపోయింది. ఇంక సంజయ్ నిన్న డీల్ చేసిన క్లైంట్స్ కి సంబంధించినది మాత్రం పెండింగ్ లో ఉంది. అది కూడా సగం అయిపోయింది ఇంకా సగం చెయ్యాలి. అతను ఇక్కడ అలా కూర్చొని చూస్తుంటే ఆమెకి పని చెయ్యడం చాలా ఇబ్బంది గా ఉంది. అతను అక్కడ నుండి వెళ్ళిపోతే బావుండు అని చూస్తోంది. ఆమె అనుకున్నందుకో ఏమో యశ్వంత్ అక్కడ నుండి లేచి తన క్యాబిన్ కి వెళ్ళాడు. అతను వెళ్ళాలని