ఈ రాత్రి నీకు బహుమతి 2

By | February 17, 2019
ఎలాగైనా సరే లిఖితను ఒప్పించాలి. ఈ బంధం నుంచి బయటపడాలి. "పదిగంటలకల్లా తయారయి బయటపడ్డాడు. ఆఫీసులో వున్నా లిఖితను ఎలా ఒప్పించాలి అన్న ఆలోచన తప్ప మరొకటి మనసుకి అందడం లేదు. రెండేళ్ళలో పెళ్ళి రద్దయిపోవాలి అన్న తన కొత్త ప్రయోగాన్ని ఎలా సమర్ధించాలి అన్నా విషయం మీద రకరకాలుగా రిహార్సల్స్ చేసుకున్నాడు. ఆఫీసు అయిపోగానే బజార్లో అటూ ఇటూ తిరిగి ఏడుగంటలకల్లా ఇల్లు చేరుకున్నాడు. లిఖిత అతను వెళ్ళేటప్పటికి ఏదో పుస్తకం చదువుకుంటోంది. భర్తను చూడగానే పుస్తకాన్ని మూసి రూమ్ లోకి వెళ్ళింది. "పూలైనా తెచ్చి వుండాల్సింది" "అంటే ఒళ్ళు బాగై పోయిందా?" "మనకి కాదండి- దేవుడికి" అతను నిరాశపడిపోయాడు. మేరేజ్ డే రోజు కూడా పూల అవసరం దేవుడికే పరిమితం కావడం దురదృష్టకరం. ఈ సంఘటనలన్నీ అతన్ని కొత్త ప్రయోగాన్ని అమలు చేయమని వత్తిడి చేస్తున్నాయి. స్నానం, భోజనం ముగించేటప్పటికి తొమ్మిధైంది. ఇద్దరూ ఒకే కాట్ మీద పడుకున్నారు గానీ ఇద్దరిలోను ఎలాంటి ఎగ్జయిట్ మెంట్ లేదు.  

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *