మిసెస్ శాంతారాం 1

By | May 11, 2020
telugu stories kathalu novels మిసెస్ శాంతారాం 1 ‘’మేడమ్ ..మిమ్మల్ని మేనేజర్ గారు రమ్మంటున్నారు …’’ అన్న పిలుపుకి ఆమె గబగబా ఆఫీసు గదిలోకి నడిచింది. మేనేజర్ వరహాలరావు ఆమెను చూసి చిన్నగా నవ్వి కూర్చోమన్నట్టు సంజ్ఞ చేశాడు … ఆమె కూర్చున్నాక ‘’లుక్ మిసెస్ శాంతారాం గారూ … మరో పది రోజుల్లోగా నేను ట్రాన్స్ ఫర్ పైన ఢిల్లీకి వెళుతున్న విషయం మీకీ పాటికి తెలుసనుకుంటాను …’’ అన్నాడు ఆమె వైపు. తెలుసన్నట్టుగా తల ఊపింది మిసెస్ శాంతారాం … అతను కొంచెంసేపు మౌనంగా ఉండి … కుర్చీలో నుండి కాస్త వంగి ఆమెతో ఇలా అన్నాడు … ‘’స్ట్రెయిట్ గా పాయింట్ లోకి వస్తున్నాను … నేను వెళ్ళిపోతే ఈ మేనేజర్ పోస్ట్ ఖాళీగా వుండిపోతుంది … ఈ ఆఫీసులో పనిచేసే స్టాఫ్ అందరిలో మీరే సీనియర్ కాబట్టి ఈ పోస్ట్ మీకు వచ్చే అవకాశాలు చాలా వున్నాయి … అదీ నేను హేడ్డాఫీసులో రికమెండ్ చేస్తే …’’ అతను చెబుతున్న మాటల్ని ఊపిరి బిగపట్టి వింటున్నది మిసెస్ శాంతారాం. ‘’సో … నేను ఇక్కడ ఎవరినీ రికమెండ్ చేయకపొతే హేడ్డాఫీసునుండే వేరే ఎవరో ఈ మేనేజర్ పోస్ట్ లో అటెండ్ అవుతారు … మిమ్మల్నని నేను ఈ పోస్ట్ కోసం హేడ్డాఫీసుకి రికమెండ్ చేయాలనుకుంటున్నాను … కానీ … ‘’ అంటూ అర్థోక్తిలో ఆగాడు వరహాలరావు … ఆమె టెన్షన్ గా అతను ఏమి చెబుతాడా అన్నట్టుగా చూస్తోంది … అతను చెప్పబోయే విషయం ఆమెకి లీలగా అర్తం అవుతున్నా … ఆ విషయాన్ని అతని నోటి నుండే వినాలనుకుంది ఆమె … ఆ ‘అంకె’ ఎంత అన్నది కన్ ఫర్మ్ చేసుకోవడానికి. ఆమె ఊహించినట్టుగానే … ‘’మీరు నాకు కొంచెం మొత్తం అందుబాటులోకి తీసుకువస్తే డెఫినెట్ గా మిమ్మల్నే

పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *